వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాపూజీ 150వ జయంతి: మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పురస్కారం!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత జాతిపిత మహాత్మా గాంధీకి అమెరికా తమ దేశపు అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని భావిస్తోంది. మహాత్మా గాంధీని గోల్డ్ మెడల్‌తో సన్మానించేందుకు అమెరికా చట్ట ప్రతినిధులు ప్లాన్ చేశారు. అమెరికా రాజకీయాల్లో పలుకుబడి కలిగిన పలువురు చట్టసభ ప్రతినిధులు ఇందుకోసం చట్టసభలో ప్రతిపాదన చేశారు.

ఆ బృందంలో నలుగురు భారత సంతతి సభ్యులు ఉన్నారు. శాంతి, అహింస కోసం కృషి చేసిన మహాత్ముడిని గోల్డ్ మెడల్‌తో సన్మానించాలని నిర్ణయించారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కరోలిన్ మాలోనే ఈ ప్రతిపాదనను చేశారు. సెప్టెంబర్ 23వ తేదీన ప్రతిపాదన చేశారు. చట్టసభ ప్రతినిధులు అమీ బిరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమిలా జయపాల్‌లు ఈ టీంలో ఉన్నారు.

సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమరదారి చూపిన క్రాంతిసూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమరదారి చూపిన క్రాంతి

US Plans To Honour Mahatma Gandhi With Countrys Highest Civilian Honour

అమెరికాలోని సంయుక్త సభలు.. అత్యున్నత పౌర పురస్కారం కింద గోల్డ్ మెడల్‌ను ఇస్తాయి. చాలా తక్కువ మంది విదేశీయులు ఈ అవార్డును గెలుచుకున్నారు. మదర్ థెరిసా(1997), నెల్సన్ మండేలా(1998), పోప్ జాన్ పాల్ 2(2000), దలైలామా(2006), ఆంగ్ సాన్ సూకీ(2008), మొహమ్మద్ యూనిస్(2010), షిమోన్ పీరస్(2014)లు గతంలో అమెరికా పౌర పురస్కారాన్ని అందుకున్నారు.

వీరికి మహాత్మా గాంధీ ఆదర్శం

మహాత్మా గాంధీ ప్రపంచంలో ఎందరికో ఆదర్శం. ఆయన ఆయుధాలు సత్యం, అహింస. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉద్యమించిన వారు కూడా గొప్ప ప్రపంచ లీడర్లుగా ఎదిగారు. ఇందులో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, హో చి మిన్హ్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, దలైలామాలు ప్రపంచ నేతలు.

English summary
Mahatma Gandhi's legacy inspired civil rights movements around the globe, from Martin Luther King's movement for racial equality to Nelson Mandela's fight against apartheid, Congresswoman Carolyn Maloney said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X