వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబర్మతీ ఆశ్రమంకు ట్రంప్... 15 నిమిషాల పాటు అక్కడే..!

|
Google Oneindia TeluguNews

గుజరాత్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మంగళవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి బయలు దేరిన అగ్రరాజ్యపు అధినేత ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాదులో ల్యాండ్ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలుకుతారు. విమానాశ్రయంలో త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి అక్కడే జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ట్రంప్ వీక్షిస్తారు.

Recommended Video

3 Minutes 10 Headlines | Namaste Trump | Women's T20 World Cup 2020 | Oneindia Telugu

అహ్మదాబాద్-ఆగ్రా-ఢిల్లీ: ట్రంప్ భారత పర్యటన మినిట్ టూ మినిట్ లైప్ అప్‌డేట్స్అహ్మదాబాద్-ఆగ్రా-ఢిల్లీ: ట్రంప్ భారత పర్యటన మినిట్ టూ మినిట్ లైప్ అప్‌డేట్స్

ఇక రోడ్ మార్గం ద్వారా ట్రంప్ సబర్మతీ ఆశ్రమంకు చేరుకుంటారు. అక్కడ 15 నిమిషాల పాటు గడుపుతారు. మహాత్ముడి జీవిత విషయాలను తెలుసుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్రంప్‌కు ఆశ్రమం విషయాలను వివరిస్తారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు సబర్మతీ ఆశ్రమంకు వస్తారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే సబర్మతీ ఆశ్రమంను ట్రంప్ సందర్శిస్తారని సీఎం విజయ్ రూపానీ చెప్పారు.

US President Donald Trump to visit Sabarmati Ashram,to spend 15 minutes

ఇదిలా ఉంటే సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆశ్రమం అంతా కలకలలాడుతోంది. 1917 నుంచి 1930 వరకు మహాత్మాగాంధీ ఇక్కడ ఉన్నారు. అనంతరం దీన్ని ఆశ్రమంగా తీర్చి దిద్దింది ప్రభుత్వం. ఈ ఆశ్రమంకు పలువురు ప్రపంచదేశాధినేతలు వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఆశ్రమంకు వచ్చారు. ట్రంప్ ఆశ్రమంలో 15 నిమిషాల పాటు ఉంటారని ఆశ్రమం కార్యదర్శి అమృత్ మోడీ చెప్పారు.

ట్రంప్ హృదయ్ కుంజ్‌ను సందర్శిస్తారని అమృత్ మోడీ చెప్పారు. హృదయ్ కుంజ్‌లో గాంధీ మరియు ఆయన భార్య కస్తూర్బా గాంధీలు నివసించారు. ఇక ఆశ్రమంను వీడి వెళ్లేముందు చరఖాను తిప్పే అవకాశం ఉందని చెప్పారు. చరఖా దాని ప్రాముఖ్యత గురించి ట్రంప్‌కు వివరించనున్నారు. అంతేకాదు ట్రంప్‌కు కాణీ టేబుల్ బుక్, మహాత్ముడు చెప్పిన 150 సూక్తులు కలిగి ఉన్న పుస్తకాన్ని ట్రంప్‌కు బహూకరిస్తామని చెప్పారు. ఇక ట్రంప్ వస్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

English summary
Prime Minister Narendra Modi will accompany Trump to the Ashram, which is closely associated with Mahatma Gandhi and India's freedom struggle, in the midst of their joint roadshow from the international airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X