వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించడంతో ప్రారంభమైంది. అనంతరం రాష్ట్రపతి దంపతులు ప్రధాని మోడీలు కలిసి ట్రంప్ దంపతులకు భారత బృందాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత ట్రంప్ అమెరికా బృందాన్ని కోవింద్ దంపతులకు ప్రధాని మోడీకి పరిచయం చేశారు. అక్కడి నుంచి రాజ్‌ఘాట్‌కు బయలు దేరి వెళ్లారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

US President Donald Trump two day India visit live Updates

రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులు అక్కడ మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఒక మొక్కను కూడా నాటారు. గతంలో ఒబామా సందర్శించిన సమయంలో కూడా ఒక మొక్కను నాటారు. ఇక కాసేపు రాజ్‌ఘాట్ ప్రాంతంలో సయమం గడిపిన ట్రంప్ దంపతులు నేరుగా హైదరాబాద్ హౌజ్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీ వీరికి స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చల కోసం ట్రంప్ మోడీ సమావేశం కాగా.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ సర్వోదయ కో ఎడ్ సీనియర్ సెకండరీ స్కూలు సందర్శనకు వెళ్లారు. అక్కడ ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. హ్యాపీ కరుక్యులమ్ గురించి తెలుసుకున్నారు. అదే సమయంలో యోగా తరగతుల గురించి కూడా మెలానియా ట్రంప్ తెలుసుకున్నారు.

ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ట్రంప్ మోడీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రక్షణ రంగంలో 3 బిలియన్ డాలర్ల మేరా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇరునేతలు సంయుక్త మీడియా సమావేశంలో చెప్పారు. ఆయిల్ రంగంలో అమెరికా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెప్పారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేస్తామని ప్రకటించారు. సీఏఏపై చర్చించలేదని చెప్పిన ట్రంప్ అది భారత అంతర్గత విషయం అని సరైన సమయంలో మోడీ సరైన నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం ట్రంప్ వ్యక్తం చేశారు. అనంతరం సాయంత్రం ఐదుగంటలకు మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ఆ తర్వాత రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ కుటుంబం అమెరికాకు బయలుదేరి వెళ్లడంతో ట్రంప్ రెండ్రోజుల భారత పర్యటన ముగిసింది.

ట్రంప్ రెండురోజుల పర్యటన సందర్భంగా మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
10:24 PM, 25 Feb

ముగిసిన భారత పర్యటన

తన అధికారిక విమానంలో డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు. కాస్సేపట్లో టేకాఫ్ తీసుకోనున్న ఎయిర్‌ఫోర్స్ వన్
10:23 PM, 25 Feb

అమెరికాకు బయలుదేరిన ట్రంప్

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్, కుటుంబ సభ్యులు
10:11 PM, 25 Feb

డిన్నర్ విత్ డొనాల్డ్

విందు ముగించుకుని రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్
10:10 PM, 25 Feb

డిన్నర్ విత్ డొనాల్డ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ దంపతులకు వీడ్కోలు పలికిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోడీ
10:09 PM, 25 Feb

డిన్నర్ విత్ డొనాల్డ్

డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందు ముగిసింది.
10:08 PM, 25 Feb

డిన్నర్ విత్ డొనాల్డ్

రాష్ట్రపతి భవన్‌లో ముగిసిన విందు.
9:52 PM, 25 Feb

డిన్నర్ విత్ డొనాల్డ్

డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లకు గౌరవార్థం ఇచ్చిన విందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్
9:51 PM, 25 Feb

డిన్నర్ విత్ డొనాల్డ్

రాష్ట్రపతి భవన్‌లో కొనసాగుతున్న విందు. మరి కాస్సేపట్లో బయలుదేరనున్న డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌, ఇవాంకా ట్రంప్.
9:29 PM, 25 Feb

డిన్నర్ విత్ డొనాల్డ్

డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లకు గౌరవార్థం ఇచ్చిన విందులో వెరైటీ డిషెష్. శాకాహారం, మాంసాహారంతో సరికొత్త రుచులు
9:25 PM, 25 Feb

డిన్నర్ విత్ డొనాల్డ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌లకు గౌరవార్థం ఇచ్చిన విందునును పురస్కరించుకుని విద్యుద్దీపాలతో అలంకరించిన రాష్ట్రపతి భవన్‌
9:01 PM, 25 Feb

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందు మెనూ ఇదే.
8:29 PM, 25 Feb

రాష్ట్రపతి భవన్‌లో ప్రముఖులకు షేక్ హ్యాండిస్తూ పరిచయం చేసుకుంటున్న ట్రంప్. ఈ సందర్భంగా విందుకు హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ట్రంప్‌కు షేక్ హ్యాండిచ్చి పరిచయం చేసుకున్నారు.
8:18 PM, 25 Feb

రాష్ట్రపతి భవన్‌లో డొనాల్డ్ ట్రంప్ దంపతులు, ఇవాంకా ట్రంప్ దంపతులతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, తదితరులు.
8:15 PM, 25 Feb

పరిమిత సంఖ్యలోనే అతిథులకు ఆహ్వానం.
8:14 PM, 25 Feb

రాష్ట్రపతి భవన్‌లో విందుకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ.
7:49 PM, 25 Feb

రాష్ట్రపతి భవన్‌లో కలియతిరిగిన ట్రంప్ దంపతులు
7:47 PM, 25 Feb

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులు.స్వాగతం పలికిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు. అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం విందును ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కోవింద్
6:21 PM, 25 Feb

పాక్ ఉగ్రదాడులను భారత్ ధైర్యంగా తిప్పికొట్టగలదు: ట్రంప్
6:08 PM, 25 Feb

అమెరికాలో ట్రావెల్ బ్యాన్ మతప్రాతిపదికన తీసుకొచ్చింది కాదు.. కొందరు అలజడి సృష్టించేందుకు అమెరికాకు వస్తున్నారు: ట్రంప్
6:07 PM, 25 Feb

మతస్వేచ్ఛాపై సుదీర్ఘంగా చర్చించాం:ట్రంప్
6:04 PM, 25 Feb

రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇది డిప్లమసీ కాదు.. నిజమైన స్నేహబంధం: ట్రంప్
6:03 PM, 25 Feb

సీఏఏపై నేను మాట్లాడను... భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం ఉంది: ట్రంప్
6:01 PM, 25 Feb

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం ఒక ప్రచారం మాత్రమే..రష్యా జోక్యం ఉండబోదు: ట్రంప్
6:00 PM, 25 Feb

చైనాతో వాణిజ్య ఒప్పందాలు ఉండవని చాలామంది అన్నారు...కానీ చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుని చూపించాం: ట్రంప్
5:59 PM, 25 Feb

వాణిజ్య రంగంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకున్నాం: ట్రంప్
5:57 PM, 25 Feb

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఇతర దేశాల నుంచి ఎలాంటి సహకారం తీసుకోవడం లేదు: ట్రంప్
5:56 PM, 25 Feb

ప్రమోటర్లకు భారత దేశం స్వర్గధామం: ట్రంప్
5:55 PM, 25 Feb

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ట్రంప్
5:52 PM, 25 Feb

ఉగ్రవాదంపై మోడీ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు: ట్రంప్
5:52 PM, 25 Feb

పాకిస్తాన్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నాకు మంచి మిత్రుడు. అయితే మోడీ-ఖాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను: ట్రంప్
READ MORE

English summary
US President Donald Trump is all set to embark on a 36-hour-long visit to India and his schedule is jam-packed. Starting from addressing 'Namaste Trump' event in Ahmedabad to visiting Taj Mahal in Agra, President Trump has a lot on his plate during his stay in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X