వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ 36 గంటల పర్యటనతో ఒనగూరే ప్రయోజనం ఏం లేదు, ట్రంప్-మోడీపై ‘సామ్నా’లో శివసేన ఫైర్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అడుగిడారో లేదో ఒకప్పటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన విమర్శలు గుప్పించింది. దేశంలో ట్రంప్ పర్యటనతో ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని మండిపడింది. ట్రంప్ 36 గంటల పర్యటనతో దేశానికి ఏ మేలు జరుగుతోందని తన పత్రిక 'సామ్నా'లో విమర్శలు గుప్పించింది. పెద్దన్న పర్యటనతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఏం మేలు జరుగుతోందని ప్రశ్నించింది.

మోడీ-ట్రంప్: 22 కిలోమీటర్ల రోడ్ షో: ఎర్ర తివాచీ..నల్ల కార్లు: మోడీ ఒక్కరే: ఎందుకంటే..!మోడీ-ట్రంప్: 22 కిలోమీటర్ల రోడ్ షో: ఎర్ర తివాచీ..నల్ల కార్లు: మోడీ ఒక్కరే: ఎందుకంటే..!

అభినందిస్తూనే..

భారతదేశ పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు అంటూ ఎడిటోరియల్‌ రాసుకొచ్చారు. పర్యటనలో భాగంగా భారత్-అమెరికా వాణిజ్య అంశాలపై చర్చకొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం ఉన్న నేపథ్యంలో అమెరికా నుంచి వాణిజ్య పరమైన మద్దతు కోరొచ్చు.. డాలర్‌తో రూపాయి మారక విలువ పెరిగేందుకు ఇది దోహదపడుతోందని అభిప్రాయపడింది.

36 గంటల్లో ఏం చేస్తారు..?


భారతదేశ ఆర్థిక సమస్యలు కేవలం 36 గంటల్లో పరిష్కారం కావు అని సామ్నాలో సుతిమెత్తగా విమర్శించింది. కానీ ట్రంప్ మహారాజుకు తమ తరఫున మాత్రం స్వాగతం పలుకుతున్నామని నొక్కి వక్కానించింది. అయితే ట్రంప్ పర్యటన నేపథ్యంలో మురికివాడలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగిందని, ఇదీ దేనికి సంకేతమని ప్రశ్నించింది. కానీ ట్రంప్ పర్యటనతో మాత్రం పేదలు, మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించింది. అంతేకాదు ట్రంప్ భారత గడ్డ వెళ్లిపోయాక.. పర్యటన ఉద్దేశం తెలియరాదని పేర్కొన్నది.

ట్రంప్ ఏం చేస్తారు..?

ట్రంప్ ఏం చేస్తారు..?

భారత పర్యటనకొచ్చిన ట్రంప్.. వర్తక, వాణిజ్యం కోసం ప్రాధాన్యం ఇచ్చారా.. అని అడిగారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను మెలానియా ట్రంప్ పర్యటిస్తోండగా.. డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు.. మోడీ చేసిన అభివృద్ధి పనులను కళ్లరా తిలకిస్తారా అని సెటైర్లు వేసింది.

అంతర్గత అంశం..

అంతర్గత అంశం..


భారతదేశ అంతర్గత అంశాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోమని శివసేన తేల్చిచెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీపై డొనాల్డ్ ట్రంప్ జోక్యం సరికాదని స్పష్టంచేసింది. భారతదేశంలో మత స్వేచ్చపై ఇతరుల జోక్య సహించబోమని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేతలే కలుగజేసుకుంటారని పేర్కొన్నది. సీఏఏ, ఎన్ఆర్సీపై చర్చించే బదులు అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు సందర్శించాలని సూచించింది.

English summary
Shiv Sena has hit out at the Narendra-Modi led government in its editorial mouthpiece Saamana, saying the 36-hour sojourn of US President Donald Trump won't make any difference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X