వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ: మోడీకి ట్రంప్ ఫోన్, ఏం మాట్లాడారంటే..?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి వైట్ హౌస్ వెల్లడించింది.

ఎమర్జెన్సీలో మాల్దీవులు: చీఫ్ జస్టిస్ అరెస్ట్, కొనసాగుతున్న ఉద్రిక్తతఎమర్జెన్సీలో మాల్దీవులు: చీఫ్ జస్టిస్ అరెస్ట్, కొనసాగుతున్న ఉద్రిక్తత

మాల్దీవుల్లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ప్రజాస్వామ్య సంస్థలు, చట్టపరమైన పాలనను గౌరవించాల్సిన అవసరం ఉందని నేతలు స్పష్టం చేసినట్లు తెలిపింది.

 15రోజులపాటు ఎమర్జెన్సీ

15రోజులపాటు ఎమర్జెన్సీ

మాల్దీవులు అధ్యక్షుడు యమీన్.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి 15రోజులపాటు అత్యవసర పరిస్థితి ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో న్యాయమూర్తిని కూడా అరెస్ట్ చేయించారు.

సుప్రీం సీజే, మాజీ దేశాధ్యక్షుడి అరెస్ట్

సుప్రీం సీజే, మాజీ దేశాధ్యక్షుడి అరెస్ట్

అంతకుముందే మాజీ దేశాధ్యక్షుడు గయూంను కూడా యమీన్ అరెస్ట్ చేయించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పార్టీ మారిన ఎంపీల సభ్యత్వాలను పునరిద్ధరించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను యమీన్ నిరాకరించిన విషయం తెలిసిందే.

 ఎమర్జెన్సీ అంశంపై ఫోన్

ఎమర్జెన్సీ అంశంపై ఫోన్

ఈ నేపథ్యంలో ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి మాల్దీవుల ఎమర్జెన్సీ అంశంతోపాటు ఇతర అంశాలపై మాట్లాడారు. మయన్మార్ అంశం, రోహింగ్యా శరణార్థుల గురించి కూడా చర్చించారు.

ఉత్తరకొరియాపైనా చర్చ

ఉత్తరకొరియాపైనా చర్చ

ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాల గురించి, ఉ. కొరియాను అణ్వాయుధాల విషయంలో నియంత్రించగలిగే అంశంపై మోడీ, ట్రంప్ చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ భద్రత విషయంలో సహకారానికి కట్టుబడి ఉన్నామని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపినట్లు వైట్ హౌస్ పేర్కొంది.

English summary
US President Donald Trump spoke to Prime Minister Narendra Modi over the phone on a wide range of issues. Trump also expressed concern over the Maldives crisis. The talk comes amid the United States' massive crackdown on Pakistan for its failure to act on terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X