వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెక్సికో నుంచి ఢిల్లీకి వలసదారులు: స్మగ్లర్లకు హెచ్చరికని పేర్కొన్న అమెరికా

|
Google Oneindia TeluguNews

అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు మెక్సికోకు వెళ్లిన 300 మంది భారతీయులను తిరిగి భారత్‌కు పంపించారు మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు. వీరంతా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. తామంతా ఉదయం 5 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నామని అయితే అన్ని లాంఛనాలు పూర్తికావడానికి మధ్యాహ్నం 1గంట అయ్యిందని జషన్‌ప్రీత్ అనే వలసదారుడు చెప్పాడు.

ఇలా మెక్సికోలో అక్రమంగా వచ్చిన వారిని తిరిగి తమ దేశాలకు పంపడం ఒక అపూర్వఘట్టం మని మెక్సికో నేషనల్ మైగ్రేషన్ ఇన్స్‌టిట్యూట్ పేర్కొంది. ఇది మెక్సికో నేషనల్ మైగ్రేషన్ ఇన్స్‌టిట్యూట్ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా చెప్పుకొచ్చింది. ఇలా పెద్ద సంఖ్యలో ఒక దేశానికి చెందిన అక్రమవలసదారులను తిరిగి ఓ ప్రత్యేక విమానంలో వారిని తమ దేశానికి పంపండం చారిత్రాత్మకంగా అభివర్ణించింది.

ఐఎన్ఎం తమ దేశం నుంచి భారత్‌కు పంపిన వారిలో 310 మంది పురుషులు ఉండగా ఒక్క మహిళ మాత్రమే ఇందులో ఉంది. వీరందరినీ ఓ చార్టర్డ్ ఫ్లైట్‌లో భారత్‌కు పంపింది. వీరితో పాటుగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు కూడా భారత్‌కు వచ్చారు. మెక్సికోలోని ఓక్సాకా, బాజా క్యాలిఫోర్నియా, వేరక్రూజ్, చియాపాస్, సొనోరా, మెక్సికో సిటీ, దురాంగో మరియు టబాస్కో రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించామని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.

US says message to Smugglers after 300 Indians deported to Delhi from Mexico

అమెరికాలోకి అక్రమంగా వస్తున్న వలసదారులకు చెక్ చెప్పకుంటే తమ దేశంలోకి వస్తున్న మెక్సికన్ ఉత్పత్తులపై సుంకాలు భారీగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో మెక్సికో అక్రమవలసదారులపై ఓ డేగ కన్ను వేసింది. ఇక అమెరికాలోకి మెక్సికో నుంచి అక్రమవలసదారులు చొరబడకుండా సరిహద్దుల వద్ద గట్టి భద్రతా చర్యలను చేపట్టింది మెక్సికో ప్రభుత్వం. అయితే భారత్‌కు చెందిన అక్రమవలసదారులను మెక్సికో తిరిగి పంపడంపై హర్షం వ్యక్తం చేసిన అమెరికా... ఇతర స్మగ్లర్లకు ఇది ఒక హెచ్చరిక కావాలంటూ ట్వీట్ ద్వారా పేర్కొంది.

English summary
Over 300 Indians, including a woman, who were deported by Mexican immigration authorities for illegally entering the country to sneak into the United States, landed here early on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X