బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికా స్టేట్స్ కార్యదర్శి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్క భారతీయుడు: స్ఫూర్తినింపారంటూ కితాబు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి రాలేక.. సరైన ఆహారాన్ని నోచుకోలేకపోతోన్న వారికి సేవలను అందించడానికి ముందుకొస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు.. రాజకీయ పార్టీలు. పేద వారికి రోజూ ఆహారాన్ని అందిస్తున్నాయి. నిత్యావసర సరుకులను ఇంటికి చేర్చుతున్నాయి. వందలాది మంది ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నప్పటికీ.. అమెరికా దృష్టిని ఆకర్షించారు ఒకే ఒక్క భారతీయుడు.

లాక్‌డౌన్ వాతావరణంలో ఇబ్బందులకు గురవుతోన్న వారికి సేవలను చేయడంలో ఆయన తమకు స్ఫూర్తిగా నిలిచారని కితాబిచ్చింది. ఆయనే శివ అరుణ్‌జి. గ్లోబల్ కల్చర్ వ్యవస్థాపకుడు. ఎస్‌సీఈఏడీ ఫౌండేషన్, రాగరష్మి ఫౌండేషన్ సహకారంతో శివ అరుణ్‌జి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆయన ప్రతిరోజూ నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. ఇప్పటిదాకా 12 వేల కేజీల నిత్యావస సరుకులు, ఆహారాన్ని పంపిణీ చేశారు.

US Secretary of Mike Pompeo greets Siva Arung for his humanitarian spirit and service

ఆయన చేస్తోన్న సేవా కార్యక్రమాలను చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ గుర్తించింది. శివ అరుణ్‌జి సేవా కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు అమెరికా కాన్సులేట్ జనరల్ అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలికి గురైన వారికి సకాలంలో ఆహారాన్ని అందజేయడంలో శివ అరుణ్‌జి చేస్తోన్న పనులను ప్రశంసిస్తూ అమెరికా కాన్సలేట్ అధికారులు ప్రశంసించారు. ఈ ట్వీట్‌ను మైక్ పాంపియోకు ట్యాగ్ చేశారు.

ఈ ట్వీట్‌ పట్ల యుఎస్ స్టేట్స్ కార్యదర్శి మైక్ పాంపియో స్పందించారు. కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులకు గురవుతోన్న వారికి అరుణ్‌జి, ఎక్స్ఛేంజ్ ఆలమ్నీ ప్రతినిధులు చేస్తోన్న సేవలు ప్రశంసనియమని అన్నారు. వారి సేవలు తమకు స్ఫూర్తినిస్తున్నాయని పాంపియో ట్వీట్ చేశారు. ఈ కొద్దిరోజుల వ్యవధిలోనే 12 వేల కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం మాటలు కాదని పేర్కొన్నారు.

Recommended Video

3 Minutes 10 Headlines | COVID-19 Outbreak In Telugu States | Kia Motors India

English summary
States Secretary of United States of America Mike Pompeo have appreciate to Siva Arung, who is the founder of Globalkulture organisation for his service to the people. Mike Pompeo tweets that to Siva Arung his service to people affected by COVID 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X