వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైషే క్యాంపుపై దాడిని సమర్థించిన అమెరికా..సరిహద్దుల్లో పరిస్థితి చక్కదిద్దాలను ఇరుదేశాలకు స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఉగ్ర మూకలు నక్కిన క్యాంప్ పై దాడి చేసిన భారత్ కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కెనడా, చైనా దేశాలు సపోర్ట్ చేయగా .. తాజాగా అమెరికా కూడా దాడులు సరైందని పేర్కొన్నది. దీంతో ఉగ్రవాదులకు అనుకూలంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోన్న వైఖరిని అంతర్జాతీయ సమాజం ఎండగడుతోంది.

ఉగ్రవాద్య వ్యతిరేక చర్యలకు సపోర్ట్
గత రెండురోజులుగా నెలకొన్న పరిణామాలతో సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపేతో మాట్లాడారు. బాలాకోట్ లో ఉన్న శిక్షణ శిబిరాలను ధ్వంసం చేయడాన్ని .. పాంపే సమర్థించారు.

US supports IAF strike on Jaish camp in Pak, Mike Pompeo tells Ajit Doval

విదేశాంగ శాఖ మంత్రులతో చర్చలు
బుధవారం ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అమెరికా నిశీతంగా గమనిస్తోంది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీతో .. పాంపే మాట్లాడారు. తీవ్రవాద వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుందని .. దానిని సమర్థిస్తూనే సరిహద్దులో పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఇరుదేశాలను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరుదేశాలు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. ఇదే అంశాన్ని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీకి స్పష్టంచేసినట్టు తెలిపారు. పుల్వామా దాడిని నిరసిస్తూ భారత్ చేపట్టే చర్యలను సమర్థిస్తామని వారం క్రితం అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్ బల్టాన్ తెలిపారు. తాజాగా పాంపై కూడా మద్దతు తెలిపారు. అయితే యుద్ధ వాతావరణం నెలకొంటుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇరుదేశాలు తొందర పడొద్దని స్పష్టంచేశారు.

English summary
National Security Advisor Ajit Doval spoke to US Secretary of State Mike Pompeo over the phone on Wednesday night amid tensions between India and Pakistan, news agency ANI reported. Mike Pompeo told Ajit Doval that the US supported India’s decision to take target terror group Jaish-e-Mohammed’s biggest training camp at Balakot in Khyber Pakhtunkhwa province of Pakistan. Indian Air Force jets flew across the Line of Control on Tuesday morning to blow up the terror camp. This comes on a day when Pakistan violated Indian airspace and attempted to target military establishments on Indian side of the Line of Control. Indian Air Force foiled the Pakistan Air Force’s attempt and shot down one F-16 jet of Pakistan. The IAF also lost one fighter plane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X