వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే నెల1 నుంచి కొన్ని భారతీయ వీసాలకు ఇంటర్వ్యూ తొలగింపు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత జాతీయులకు మేలు చేసే ఓ మంచి పనితో ముందుకు వస్తోంది అమెరికా. అదేమంటే.. వీసా దరఖాస్తు ప్రక్రియను తగ్గించేందుకు కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తు చేసుకునే వాటిలో కొన్నింటికి తప్పనిసరిగా ఉన్న ఇంటర్వ్యూను తొలగిస్తోంది.

విషాదం: డ్యూటీ చేస్తూ తుపాకీతో కాల్చుకున్న ఐఏఎఫ్ జవాను చౌదరివిషాదం: డ్యూటీ చేస్తూ తుపాకీతో కాల్చుకున్న ఐఏఎఫ్ జవాను చౌదరి

ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్లను ఉద్దేశించి యూఎస్ కాన్సులేట్ మాట్లాడుతూ.. వీసా రెన్యూవల్ సమయాన్ని తగ్గించడం, కస్టమర్ సర్వీసును మెరుగుపర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతదేశం నుంచి వచ్చే అన్ని వీసాలను దీనికింద పరిశీలిస్తామని చెప్పారు.

US to waive mandatory interview for certain visas

యూఎస్ వీసా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకునేవారు(కొన్ని పరిమితులకు లోబడి), 14ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలు, 79ఏళ్లకు మించిన వృద్ధులకు వచ్చే నెల(సెప్టెంబర్ 1) నుంచి ఇంటర్వ్యూను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 11 కేంద్రాల్లో దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత వీసా అప్లికేషన్ సెంటర్ ఉద్యోగులు దరఖాస్తుకు సంబంధించిన తదుపరి చర్యను తీసుకుంటారు. యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్‌కి పంపే ముందే డాక్యుమెంట్లను పరిశీలించడం జరుగుతుంది. దరఖాస్తు సమర్పించిన ఏడు పనిదినాలల్లో దరఖాస్తుకు సంబంధించిన సందేశాన్ని దరఖాస్తుదారులు అందుకుంటారు. అప్పుడు దరఖాస్తుదారుడు తప్పక ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుందని కాన్సులేట్ చెప్పారు.

ఒకవేళ ఇంటర్వ్యూకు హాజరుకావాలంటే దరఖాస్తుదారులు ఎంపికైన పోస్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత ఇంటర్వ్యూను ఎదుర్కోనేవారి వివరాలను తెలపడం జరుగుతుందని చెప్పారు. కాగా, మనదేశంలో యూఎస్ వీసా దరఖాస్తు కేంద్రాలు న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, కొచ్చి, ఛండీగఢ్, జలందర్, పుణె, అహ్మదాబాద్‌లలో ఉన్నాయి.

English summary
The US is working on making the visa application process shorter for Indian nationals and starting September 1, certain applicants can apply for a waiver from mandatory interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X