వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన గౌరవం: అమెరికా విశ్వవిద్యాలయంలో హిందీ కోర్సు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మన దేశ జాతీయ భాష హిందీకి అమెరికాలోని మోంటానా విశ్వద్యాలయం సబ్జెక్టుగా స్ధానం కల్పించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విశ్వవిద్యాలయంలో హిందీ లెర్నింగ్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ ప్రొగ్రామ్స్‌లో భాగంగా ఈ కోర్సుని అందిస్తున్నారు. భారత్‌కు చెందిన గౌరవ మిశ్రా హిందీ కోర్సుకు ఇన్‌స్ట్రక్టర్‌గా వ్వవహరిస్తారని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గౌరవ మిశ్రా విశ్వవిద్యాలయంలో హిందీని బోధించడానికి ఆగస్టులో మధ్యలో అమెరికాకు రానున్నారు.

US University to Offer Hindi Language Course

రెండు సెమిస్టర్ల విధానంగా కోర్సు ఉండనుంది. దీనిపై మోంటానా విశ్వవిద్యాలయం లిబరల్ స్టడీస్ ప్రొఫెసర్ రూత్ వనిత మాట్లాడుతూ ఇదో గొప్ప విజయమని, అరుదైన గౌరవమని అన్నారు. దీంతో అమెరికాలోని నాలుగు విశ్వవిద్యాలయాల్లో హిందీ కోర్సుకు ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారని అన్నారు.

అంతే కాదు రాబోయే రోజుల్లో హిందీ సబ్జెక్టుని రెగ్యులర్ అకడమిక్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు విశ్వవిద్యాలయం ప్రయత్నిస్తోందన్నారు. హిందీని ఇండో-యూరోపియన్ భాషగా భావిస్తుంటారు. ఇంగ్లీషుతో పాటు యూరోపియన్ భాషలకు పూర్వకాలంలో మధ్యవర్తిత్వంగా ఉండేదంట.

English summary
The University of Montana in the US is offering its students a chance to learn Hindi language during the next academic year and a Fulbright instructor from India will teach the subject.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X