వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చొరబాట్లపై పాక్‌కు హెచ్చరికలు ..కశ్మీర్‌ను నిశితంగా పరిశీలిస్తోందన్న ట్రంప్ సర్కార్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆర్టికల్ 370 ఎఫెక్ట్ ... పుల్వామా తరహా దాడులకు పాక్ ప్లాన్ ! || Oneindia Telugu

న్యూఢిల్లీ: కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాకు చెప్పలేదని ఆ దేశ అధికారులు చెప్పిన కొన్ని గంటల్లోనే... జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై కూడా అమెరికా ప్రభుత్వం స్టడీ చేస్తోందని చెప్పారు. మరోవైపు పాక్ బెదిరింపు ధోరణిని కూడా అమెరికా పరిశీలిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఆ దేశం భారత్‌తో వాణిజ్య సంబంధాలు, దౌత్యపరమైన సంబంధాలకు చెక్ పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ అధికారి పేర్కొన్నారు.

"అమెరికా అన్ని విషయాలను జాగ్రత్తగా సమీక్షిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ కశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిణామాలను పరిశీలిస్తున్నాం. అంతేకాదు ఆ ప్రాంతంలో అస్థిరత కూడా నెలకొనే అవకాశం ఉండటంతో దానిపై కూడా ఆరా తీస్తున్నాం"అని ట్రంప్ ప్రభుత్వంలో ఓ ముఖ్య అధికారి వెల్లడించారు. ఇక దక్షిణాసియాలో శాంతినెలకొనేలా అన్ని దేశాలు ప్రయత్నించాలని ఇందుకోసం చర్చలు ప్రారంభించాలని అమెరికా కోరింది. జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న ఆంక్షలపై సెనేటర్ రాబర్ట్ మెనెండెజ్, కాంగ్రెస్ అధికారి ఇలియట్ ఏంజెల్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

US warns Pakistan against any infiltration, says Trump govt is watching Indias Kashmir move

భారత్‌పై పాకిస్తాన్ ప్రతీకారచర్యలకు పాల్పడకూడదని వారు తెలిపారు. అంతేకాదు చొరబాట్లను ప్రోత్సహించరాదని కూడా హెచ్చరించారు. తమ భూభాగంపై ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని పాకిస్తాన్‌కు సెనేటర్లు సూచించారు. జమ్మూకశ్మీర్.. భారత్ పాక్ సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు ప్రతి ఒక్క దేశం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే సోమవారం రోజున జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ అమిత్ షా ప్రవేశపెట్టిన తీర్మానంకు పార్లమెంటు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందింది. అంతకు ముందు జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర బలగాలు అక్కడ మోహరించాయి. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను గృహనిర్బంధంలో ఉంచారు.

మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌లను భారత్ తమకు అన్యాయం చేసిందంటూ ఈ విషయాన్ని ప్రపంచ దేశాధినేతల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు.

English summary
US said that it is closely monitoring the situation in Jammu and Kashmir and had urged the south Asian country leaders to start a dialogue in maintaining peace and stability in the region. US also warned Pakistan to not to take any retaliatory actions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X