• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ భక్తులతో భజన కోసం రెడీ: మోడీ స్పీచ్‌పై జగన్ వ్యూహకర్త సెటైర్లు మామూలుగా లేవుగా

|

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా, అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఏ దేశంలోనూ లేనివిధంగా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. పాజిటివ్ కేసుల రికార్డుల్లో భారత్ టాప్‌లో ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో నమోదైన రోజువారీ కేసులను పరిగణనలోకి తీసుకుంటే..భారత్‌ దరిదాపుల్లో ఏ దేశమూ లేదు. దేశంలో 62 శాతం పాజిటివ్ కేసుల గ్రోత్ రేట్ కనిపించగా.. మరెక్కడా ఈ స్థాయిలో ఆ సంఖ్య రికార్డ్ కావట్లేదు.

మరదలిపై కన్ను: తమ్ముడి చేతిలో అన్న ఫసక్: రెండేళ్ల కిందట గుంతలో: తల్లి అరెస్ట్: అదే కారణం

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మంగళవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పలు కీలక సూచనలు చేశారు. కరోనా వైరస్‌పై పోరాటం ఇంకా ముగియలేదని అన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా కోసం అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. వైద్య అవసరాల కోసం మందుల ఉత్పత్తిని రెట్టింపు చేశామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించేలా తీసుకోవాల్సిన చర్యలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.

use bluff and bluster to claim victory over COVID19 Crisis, says Prashant Kishor

మోడీ చేసిన ప్రసంగం పట్ల బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం మోడీపై సెటైర్లు సంధించారు. కరోనా మిగిల్చిన సంక్షోభ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడం మోడీకి తెలియట్లేదని పరోక్షంగా చురకలు అంటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పరిపాలకు దూరదృష్టి లోపించిందనే విషయం మరోసారి స్పష్టమౌందని పేర్కొన్నారు.

సమస్యను అర్థం చేసుకోవడం, దాన్ని పరిష్కరించడం.. తెలియదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. సమస్యను దాచి పెట్టడం మాత్రం బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. ఏదో ఒకరోజు హఠాత్తుగా దాన్ని నియంత్రించినట్లు చెప్పుకోవడం, ఆ సమస్యపై విజయం సాధించినట్లు ప్రకటించుకుంటున్నారని విమర్శించారు. ఆ సమస్య యధాతథంగా కొనసాగుతూనే ఉంటే.. దాన్ని ఇతరుల మీదికి మళ్లించడం కేంద్ర పాలకులు అనుసరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితులు అంతా బాగున్నప్పుడు తమ భక్తులతో క్రెడిట్ ఇప్పించుకోవడం తెలిసిన విద్యేనని అన్నారు.

  NTR Is The Vaccine For CBN, Lokesh Viruses ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వేయించుకోండి || Oneindia Telugu

  English summary
  Prashant Kishor's statement came after PM Modi addressed the nation on the coronavirus situation amid a surge in cases. He also alleged that the Prime Minister bluffed people to claim victory in the battle against the pandemic.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X