వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాస్త కామన్‌సెన్స్ ఉపయోగించండి, పాకిస్తాన్‌పై పెద్ద ఆలోచన!!: నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాఫెల్ విమానాలపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నిప్పులు చెరిగారు. అసలు మీకు కామన్‌సెన్స్ ఉందా అని దుయ్యబట్టారు.

భారత మిలిటరీ స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్థాన్ విమానాలు వచ్చిన సమయంలో రాఫెల్ విమానాలు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని మోడీ వ్యాఖ్యానించారు. ఆ విమానాలు సమయానికి రాలేదని, అందుకు విపక్షాలు కారణమన్నారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. రాఫెల్ విమానాల ఆలస్యానికి ప్రధాని మోడీయే కారణమన్నారు.

<strong>భారత పైలట్ల దెబ్బ, అమెరికా లక్షలకోట్ల డీల్‌పై ప్రభావం! పాక్ ఎఫ్ 16 ఉపయోగంపై పెద్దన్న ఆందోళన</strong>భారత పైలట్ల దెబ్బ, అమెరికా లక్షలకోట్ల డీల్‌పై ప్రభావం! పాక్ ఎఫ్ 16 ఉపయోగంపై పెద్దన్న ఆందోళన

కాస్త కామన్ సెన్స్ ఉపయోగించండి

కాస్త కామన్ సెన్స్ ఉపయోగించండి

ఈ సమయానికి రాఫెల్ విమానాలు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని మోడీ చెప్పడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులను శంకిస్తున్నట్లుగా కాంగ్రెస్ మాట్లాడింది. దీనిపై మోడీ స్పందించారు. దయచేసి మీ ఇంగిత జ్ఞానాన్ని వాడండని, దాడుల సమయంలో రాఫెల్ విమానాలు ఉండి ఉంటే మనకు చెందిన ఒక్క విమానం కూడా కూలేది కాదని, పాకిస్థాన్‌ది ఒక్కటి కూడా మిగిలేది కాదని అని తాను చెప్పానని ప్రధాని స్పష్టం చేశారు. ఒకవేళ రాఫెల్‌ను సరైన సమయానికే మనం పొంది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పానని, అంటే మన విమానం కూలకపోయేదని తన ఉద్దేశ్యమని అన్నరు. కానీ తాను దాడులను శంకిస్తున్నట్లుగా ప్రతిపక్షాలు చిత్రీకరించడం విడ్డూరమన్నారు.

నేను చిన్న పనులు చేయను.. పెద్దవే చేస్తాను

నేను చిన్న పనులు చేయను.. పెద్దవే చేస్తాను

తాను చిన్నచిన్న పనులు చేసేవాడిని కాదని, పెద్ద పనులే చేస్తానని మోడీ చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైన ప్రశంసలు కురిపించారు. తనకు చిన్నచిన్న పనులు చేయడం అలవాటు లేదని, పెద్ద పనులే చేస్తానని చెప్పారు. తన ప్రసంగంలో భాగంగా కొచ్చికి బదులు కరాచీ అని ప్రధాని తడబడ్డారు. దీంతో ఆయనే మళ్లీ మాట్లాడుతూ... ఇలా తడబడుతున్నానంటే తన మైండ్‌లో కరాచీ గురించి పెద్ద ఆలోచనే చేస్తున్నానే విషయం అర్థం చేసుకోవాలని చెప్పారు.

 కొందరు ఇంకా నమ్మడం లేదు ఎందుకు

కొందరు ఇంకా నమ్మడం లేదు ఎందుకు

మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులను మీరు నమ్మడం లేదా అని ప్రతిపక్షాలను ఉద్దేశించి మోడీ ప్రశ్నించారు. మన సైన్యం పట్ల నేను గర్వపడుతున్నానని చెప్పారు. కానీ కొందరు మాత్రం మన సైన్యం పాక్‌లోకి వెళ్లి తీవ్రవాద దాడులు చేసిందా అనే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు నేతలు ఇంకా ఎందుకు ఈ దాడులను ఎందుకు నమ్మడం లేదన్నారు.

English summary
Talking about the ongoing Indo-Pak situation, PM Modi mentioned, “Please use common sense. What I said was if the Indian Air Force had the Rafale today, the situation would have been different, none of our fighter jets would have gone down and none of theirs saved. I can't do anything if some people fail to understand this.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X