వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

N-95 మాస్కులు ఎందుకు హానికరం.. కేంద్రం ఏం చెబుతోంది

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెబుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం మాస్కలు వినియోగంపై ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలు ఏంటి.. ఎలాంటి మాస్కుల వినియోగంలో జాగ్రత్తలు వహించాలని కోరుతోంది..?

Recommended Video

#N95Mask : N95 మాస్క్‌లతో జాగ్రత్త.. హానికరం అంటున్న కేంద్రం! || Oneindia Telugu

స్మోకర్స్ బీ కేర్‌ఫుల్ : పొగరాయుళ్లకే కరోనావైరస్ రిస్క్ ఎక్కువట..!స్మోకర్స్ బీ కేర్‌ఫుల్ : పొగరాయుళ్లకే కరోనావైరస్ రిస్క్ ఎక్కువట..!

N-95 మాస్కులు ఎందుకు ప్రమాదకరం..?

కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే కనీస జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతేకాదు మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలు సైతం విధిస్తున్నాయి. తాజాగా మాస్కులు వినయోగంలో కేంద్ర ప్రభుత్వం పలు హెచ్చరికలు జారీ చేసింది. వాల్వులు కలిగి ఉన్న ఎన్‌-95 మాస్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం సూచనలు చేస్తోంది. వాల్వులు కలిగి ఉన్న ఎన్‌-95 మాస్కులు కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించలేవని అదే సమయంలో వీటి వినియోగం హానికరం అని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం.

 ఎలాంటి మాస్కులను కేంద్రం సూచిస్తోంది..?

ఎలాంటి మాస్కులను కేంద్రం సూచిస్తోంది..?


ఇక ఇంట్లో బట్టతో తయారు చేసిన మాస్కులు వినియోగం చాలా సురక్షితమంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తాము ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. ఎన్‌-95 మాస్కుల వినియోగం వల్ల వైరస్ బయటకు వెళ్లదని వెల్లడించింది. ముఖాన్ని కప్పుకునేందుకు ఇంట్లో తయారు చేసిన మాస్కులను వినియోగించడం ఉత్తమం అని ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన అడ్వైజరీల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ప్రతిరోజూ బట్టతో చేసిన ఈ మాస్కులను శుభ్రంగా కడుక్కుని తిరిగి ధరించుకోవచ్చని వెల్లడించింది.

మాస్కులు మళ్లీ వాడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మాస్కులు మళ్లీ వాడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?


ఇక ఈ తరహా క్లాత్ మాస్కులను వేడినీటిలో 5 నిమిషాల పాటు ఉంచి ఆపై వాష్ చేయాలని వెల్లడించింది. అనంతరం మాస్కును ఆరబెట్టాలని పేర్కొంది. ఈ వేడినీళ్లలో కాస్త ఉప్పు కలిపితే మెరుగ్గా ఉంటుందని వెల్లడించింది. ఇక ఈ మాస్కులు తయారు చేసేటప్పుడే ఆ బట్ట ముఖాన్ని పూర్తిగా కప్పివేసేలా కొలతలు తీసుకుని ఆ తర్వాత తయారు చేసుకోవాలని సూచించింది. ముఖానికి ధరించినప్పుడు మధ్యలో గ్యాప్ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. ఇక ఫేస్ మాస్కు ధరించకుముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించిన కేంద్ర ప్రభుత్వం... తిరిగి వాడే ముందు కచ్చితంగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాతే ధరించాలని సూచన చేసింది. అంతేకాదు ఒకరి ఫేస్‌ మాస్క్‌ మరొకరు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదని కోరింది.

English summary
The Centre has written to all states and union territories warning against the use of N-95 masks with valved respirator by people, saying these don’t prevent the virus from spreading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X