వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూజర్ల దెబ్బ... ప్రైవసీ పాలసీ విషయంలో వెనక్కు తగ్గిన వాట్సప్

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవ సంస్థ వాట్సప్ సంస్థ ప్రైవసీ పాలసీ మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం యూజర్లను వాట్సప్ వినియోగానికి దూరం చేసేలా మారింది. ఇప్పటికే పలు కంపెనీలు వాటికి సంబంధించిన సెన్సిటివ్ విషయాలను వాట్సప్ ద్వారా చర్చించవద్దని ఉద్యోగులకు సూచించాయి. ఇక క్రమంగా వాట్సప్ యూజర్ల సంఖ్య ప్రస్తుతం వాట్సప్ తీసుకున్న నిర్ణయంతో తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వాట్సప్ తన నిర్ణయాన్ని కొంత కాలం పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన గూగుల్... అక్కడ రాజకీయ ప్రకటనలపై తాత్కాలిక నిషేధం .. రీజన్ ఇదే !!రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన గూగుల్... అక్కడ రాజకీయ ప్రకటనలపై తాత్కాలిక నిషేధం .. రీజన్ ఇదే !!

కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్ల విముఖత .. మరికొంత కాలం వాయిదా

కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్ల విముఖత .. మరికొంత కాలం వాయిదా

ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఫేస్ బుక్ తో డాటాను పంచుకోవడానికి అంగీకరిస్తూ ప్రైవసీ పాలసీ మార్పు చేసిన కారణంగా వినియోగదారులు తమ వ్యక్తిగత డేటా విషయంలో ఆందోళనకు గురయ్యారు. ఫిబ్రవరి 8 వ తేదీ లోపు కొత్త ప్రైవసీ పాలసీని అందరూ అంగీకరించాల్సి ఉండగా, వాట్సాప్ యూజర్లు ఒక్కొక్కరుగా నూతన ప్రైవసీ పాలసీ పై విముఖత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీ కి సంబంధించిన అప్డేట్ ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు వాట్సప్ ప్రకటించింది.

 వ్యక్తిగత సమాచార భద్రత పై నెలకొన్న సందేహాల దృష్ట్యా వాట్సప్ నిర్ణయం

వ్యక్తిగత సమాచార భద్రత పై నెలకొన్న సందేహాల దృష్ట్యా వాట్సప్ నిర్ణయం

వ్యక్తిగత సమాచార భద్రత పై నెలకొన్న సందేహాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. తన ప్రైవసీ పాలసీ పై వస్తున్న తప్పుడు వార్తలతో వినియోగదారులు ప్రభావితం అవుతున్నారని, అనవసరమైన ఆందోళనకు గురి అవుతున్నారని, అందుకే ప్రస్తుతానికి పాలసీని వాయిదా వేసినట్లుగా ప్రకటించింది వాట్సప్. అంతేకాదు ఫిబ్రవరి ఎనిమిదో తారీకు లోపు ప్రైవసీ పాలసీని అందరూ ఆమోదించాల్సి ఉండగా, ఇక ఈ గడువును మే 15వ తేదీ నుండి అమలు చేయనున్నట్లుగా వాట్సప్ వెల్లడించింది.

మే 15 వరకు గడువు పొడిగించిన వాట్సప్

మే 15 వరకు గడువు పొడిగించిన వాట్సప్

కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించకున్నప్పటికీ ఎవరి ఖాతాలు నిలిచిపోవని వెల్లడించింది. మే 15 వరకు ఈ గడువు పొడిగించిన కారణంగా వాట్సప్ గోప్యత మరియు భద్రతపై అపోహలను తొలగించడానికి ప్రయత్నం చేస్తోంది వాట్సప్. కొత్త ప్రైవసీ పాలసీలో భాగంగా యూజర్ల డేటాను మాతృ సంస్థ అయిన ఫేస్ బుక్ తో పంచుకుంటామని వాట్సప్ ప్రకటన ఇవ్వడంతోనే అసలు వివాదం మొదలైంది. వాట్సప్ ఆటోమేటిక్ గా సేకరించే డేటా మొత్తం ఫేస్ బుక్ కు వెళ్ళిపోతుందని దీనివల్ల సెక్యూరిటీ సమస్యలు వస్తాయని వాట్సప్ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

 వినియోగదారుల్లో అపోహలు తొలగించేందుకు వాట్సప్ నిర్ణయం

వినియోగదారుల్లో అపోహలు తొలగించేందుకు వాట్సప్ నిర్ణయం

ఇటీవల రోజుల్లో చాలా వరకు అందరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న క్రమంలో తమ అకౌంట్ డేటా కూడా వాట్సప్ వల్ల లీక్ అవుతుంది అన్న అనుమానం వినియోగదారుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే యూజర్ల డేటా భద్రతపై నిపుణులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు కంపెనీలలలో ఉద్యోగులను అలర్ట్ చేస్తున్నారు. చాలామంది వాట్సాప్ బదులు ప్రత్యామ్నాయాలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో వాట్సప్ ప్రైవసీ పాలసీ అమలును మరికొంతకాలం వాయిదా వేసి వినియోగదారుల అపోహలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.

English summary
WhatsApp The smartphone app, a huge hit across the world, canceled its February 8 deadline for accepting an update to its terms concerning sharing data with Facebook, saying it would use the pause to clear up misinformation around privacy and security. "We've heard from so many people how much confusion there is around our recent update," WhatsApp said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X