Exit polls: ఉత్తర ప్రదేశ్‌లో ఆ రాజ్యమే: అధికారంలోకి ఎవరు వస్తారనేది.. తేలిందిగా
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. చివరి విడత ఉత్తర ప్రదేశ్ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌పై నిలిచాయి. దీనితో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటితమౌతున్నాయి.
ఏపీలో
రెండో
అధికారిక
భాషగా:
చట్టసవరణ:
మంత్రివర్గ
నిర్ణయాలివే:
గౌతమ్
రెడ్డి
మృతిపట్ల

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..
ఉత్తర ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ- ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ మధ్య టగ్ ఆఫ్ వార్‌గా నడిచిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది తేలుతోంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ సమాజ్‌వాది పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందని అంచనా వేసింది.

యోగి..రెండోసారి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రభుత్వ పగ్గాలను అందుకుంటారని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను బీజేపీ అందుకుంటుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 202 స్థానాలు అవసరం అవుతాయి. ఈ మేజిక్ ఫిగర్‌ను బీజేపీ అందుకుంటుందని అంచనా వేసింది. సీట్లు మాత్రం భారీగా తగ్గుతాయని అభిప్రాయపడింది.

220 నుంచి 240 స్థానాలకు..
బీజేపీ 38 ఓట్ల శాతంతో 220 నుంచి 240 సీట్లలో విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. సమాజ్‌వాది పార్టీ 35 శాతం ఓట్ల తేడాతో 140 నుంచి 160 స్థానాలను అందుకోగలుగుతుందని తెలిపింది. బహుజన్ సమాజ్‌వాది పార్టీ 12 నుంచి 18, ఆర్ఎల్డీ 8 నుంచి 12, కాంగ్రెస్ 6 నుంచి 10 స్థానాలకు పరిమితమౌతాయని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే- యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం కానుంది.

సర్వే.. అంశాలివే..
సమాజ్‌వాది పార్టీ తన ఓటు శాతాన్ని, అసెంబ్లీ స్థానాల సంఖ్యను భారీగా పెంచుకున్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందని ఈ సర్వే ద్వారా స్పష్టమౌతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే చేపట్టినట్లు పీపుల్స్ పల్స్ తెలిపింది. పురుషులు 51, మహిళలు 49 శాతం అభిప్రాయాలను సేకరించినట్లు పేర్కొంది.