• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యూపీలో వేగంగా పరిణామాలు- యోగీతో పోరులో అఖిలేష్ ముందంజ- కాంగ్రెస్ సంచలనాలు

|
Google Oneindia TeluguNews

యూపీలో ఎన్నికల రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటివరకూ యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని భావించిన వారంతా తమ అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా గుడ్ బై చెప్తుండటం, వారంతా ఎస్పీ ఓటు బ్యాంకు అయిన బీసీలే కావడంతో ఆ మేరకు కాషాయ పార్టీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. మరోవైపు కాంగ్రెస్ తన తొలిజాబితాలోనే సంచలనాలకు తెరలేపింది.

 ఆసక్తికరంగా యూపీ పోరు

ఆసక్తికరంగా యూపీ పోరు

యూపీలో వచ్చే రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా మారిపోయాయి. యూపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న బీజేపీ.. అలా జరక్కపోతే మాత్రం కచ్చితంగా సార్వత్రిక పోరులో ఎదురుదెబ్బ తప్పదని అంచనా వేస్తోంది. దీంతో బీజేపీ అక్కడ సర్వశక్తులొడ్డుతోంది.

యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై మైనార్టీ వర్గాలతో పాటు బీసీల్లోనూ అసంతృప్తి నెలకొంది. గతంలో వీరి ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. మరోసారి అధికారంలోకి రావాలంటే వీరి మద్దతు తప్పనిసరి. కానీ ఇప్పుడు వీరంతా వరుసగా బీజేపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇది అంతిమంగా విపక్ష సమాజ్ వాదీ పార్టీకి వరంగా మారుతోంది.

బీజేపీకి వరుస షాకులు

బీజేపీకి వరుస షాకులు

ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో కంటే సొంత పార్టీ నేతల్లోనే ఎక్కువగా అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల్లో ఇద్దరు మంత్రులతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అందునా బీసీ వర్గాల్లో పట్టున్న స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్ వంటి వారు తప్పుకోవడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది.

వీరిద్దరూ కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీ అవకాశాల్ని ప్రభావితం చేసే అవకాశముంది. అలాగే వీరిద్దరూ బీజేపీ ప్రత్యర్ధి సమాజ్ వాదీ పార్టీలోకి వెళ్తుండటం కాషాయ శిబిరానికి మింగుడు పడటం లేదు. వీరి బాటలోనే త్వరలో మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎస్పీలోకి ఫిరాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అఖిలేష్ కు వరంగా బీజేపీ పరిస్ధితి

అఖిలేష్ కు వరంగా బీజేపీ పరిస్ధితి

ఈసారి అసెంబ్లీ పోరులో బీజేపీని ఎట్టి పరిస్ధితుల్లోనూ మట్టి కరిపించాలనే లక్ష్యంతో అందరి కంటే ముందుగా ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేసిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఊహించిన దాని కంటే ఎక్కువగానే బీజేపీని దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా బీజేపీతో, సీఎం యోగీతో సై అంటే సై అంటూ ముందుకు సాగుతున్న తీరు అఖిలేష్ ను సీఎం రేసులో ముందు నిలబెట్టింది.

ఇప్పటివరకూ బీజేపీ విధానాల్ని ప్రజల్లో ఎండగట్టిన అఖిలేష్ ఇప్పుడు బీజేపీని బలహీనం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా గతంలో తమ ఓటు బ్యాంకుగా ఉండి మధ్యలో బీజేపికి జై కొట్టిన బీసీ వర్గాల్ని ఏకం చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో అఖిలేష్ దూకుడును తట్టుకునేందుకు బీజేపీ అపసోపాలు పడుతోంది.

కాంగ్రెస్ సంచలనాలు

కాంగ్రెస్ సంచలనాలు

యూపీ ఎన్నికల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ... ప్రియాంక గాంధీ నేతృత్వంలో కనీస సీట్లు దక్కించుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ, ఎస్పీల్ని చికాకుపెడుతూ తమ తొలి జాబితాలో ప్రకటించిన 125 సీట్లలో 40 శాతం సీట్లు మహిళలకు, మరో 40 శాతం యువతకు ఇచ్చేసింది.అంతే కాదు ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి ఆశాసింగ్ కి కూడా ఈసారి అక్కడి నుంచే పోటీకి దించుతోంది. తద్వారా తొలి జాబితా నుంచే ప్రియాంక నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి.

  Assembly Elections 2022 Schedule For 5 States | Election Commission | Oneindia Telugu
  యోగీపై అఖిలేష్ పైచేయి

  యోగీపై అఖిలేష్ పైచేయి

  యూపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైన కొత్తలో రథయాత్ర మొదలుపెట్టిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఇప్పుడు బీజేపీని చికాకుపెట్టని రోజు లేదు. యూపీకి వచ్చే ప్రతీ బీజేపీ నేత, అంతెందుకు ప్రధాని మోడీ, అమిత్ షా కూడా అఖిలేష్ నే టార్గెట్ చేస్తున్నారు. అంతలా ప్రచార పర్వాన్ని తనవైపు తిప్పేసుకున్న అఖిలేష్.. సీఎం యోగీపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

  అఖిలేష్ ను ఎదుర్కొనేందుకు ఇప్పుడు జాతీయ స్ధాయి నేతల్ని, ఇతర బీజేపీ రాష్ట్రాల సీఎంలను యోగీ యూపీకి పిలిపిస్తున్నారు. మరోవైపు మాయావతి మౌనం, కాంగ్రెస్ నామమాత్రపు పోటీ అఖిలేష్ కు కలిసొస్తోంది. దీంతో యోగీని ఈసారి అఖిలేష్ సీఎం పీఠం దించేసినా ఆశ్చర్యం లేదనేలా వాతావరణం మారిపోతోంది.

  English summary
  poll politics in uttar pradesh turns favourable to samajwadi party chief akhilesh yadav with latest developments in bjp.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X