
బీజేపీకి షాక్: ఎస్పీలో చేరిన మాజీ మంత్రి ధారాసింగ్
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రంజు మీద ఉన్నాయి. పార్టీలలో చేరికలు హీటెక్కిస్తున్నాయి. ఎక్కువగా ఎస్పీలోకి నేతల చేరికలు ఉంటున్నాయి. వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన బలమైన నాయకుడు, తాజా మాజీ మంత్రి ధారా సింగ్ చౌహాన్ పార్టీ మారారు. ఆయన బీజేపీ నుంచి సమాజ్ వాది పార్టీలో చేరారు. నిన్న మరో ఇద్దరు మంత్రులు, ఏడుగురు బీజేపీకి గుడ్ బై చెప్పి ఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.
చౌహాన్ ఓబీసీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చౌహాన్. ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ పార్టీలో ఖాళీ లేదని, గది అంతా పూర్తిగా నిండి పోయిందన్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అఖిలేష్‌పై ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోపే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

యూపీలో రాజకీయాలు మరింత రసవత్తరంగా రంజుగా మారాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రస్తుం యూపీలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓ వైపు ఎస్పీ మరో వైపు బీజేపీ మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. సర్వే సంస్థలన్నీ కాషాయానిదే పవర్ అంటుండగా 80 శాతం సీట్లు ఎస్పీకి 20 శాతం సీట్లు బీజేపీకి వస్తాయని జోష్యం చెప్పారు. ఇప్పటి దాకా ఎస్పీలో చేరిన మంత్రుల సంఖ్య ముగ్గురు కావడం విశేషం. చేరిన వారంతా బలమైన ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ధారా సింగ్ చౌహాన్ తో పాటు ఆప్నా దళ్ ఎమ్మెల్యే ఆర్కే వర్మ కూడా సమాజ్ వాది పార్టీలో చేరారు. రాష్ట్రంలో ఎస్పీ గాలి వీస్తోందని.. ప్రజలు మార్పును కోరుతున్నారని అఖిలేశ్ యాదవ్ కామెంట్ చేశారు.
ఇటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్పీ, కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించి 57 మంది, సెకండ్ ఫేజ్‌కు సంబంధించి 48 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. బీజేపీ యూపీ ఇంచార్జీ ధర్మేంద్ర ప్రదాన్ జాబితాను విడుదల చేశారు.సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి బరిలోకి దిగుతారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మోర్య సిరటు నుంచి పోటీ చేస్తారు.