వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల బెండ్ తియ్యాలి, ర్యాలీలో భజన చేస్తారా: యూపీ సీఎం యోగీ ఫైర్ !

|
Google Oneindia TeluguNews

లక్నో: ఎన్నికలు అంటేనే రణరంగం, అక్కడ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, తిరుగేటు ఉండాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ర్యాలీల్లో ప్రతిపక్ష నాయకులక కోసం తాము భజన చేస్తామా ? అని యోగీ ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) నుంచి వచ్చిన మరో నోటీసు విషయంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు.

బీజేపీ కార్యకర్తల బహిరంగ సభా సమావేశంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తనదైన శైలిలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో తమ రాజకీయ విరోదులను విమర్శించాలని అన్నారు. అంతే కాని బహిరంగ సభల్లో మైకు తీసుకుని భజన చెయ్యకూడదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యంగంగా అన్నారు.

Uttar Pradesh CM Adityanath defended his remark against a Samajwadi Party candidate,

ఉత్తరప్రదేశ్ లోని సంభల్ లో ఏఫ్రిల్ 19వ తేదీ జరిగిన ర్యాలిలో సమాజ్ వాది పార్టీకి చెందిన సీనియర్ నేత షఫికుర్ రెహమాన్ బార్క్ ను బాబర్ కీ ఔలాద్ అంటూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విమర్శించారు. ఇదే విషయంలో యోగీ ఆదిత్యనాథ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

తాను గతంలో లోక్ సభ సభ్యుడిగా ఉన్నానని యోగీ ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో సమాజ్ వాది పార్టీకి చెందిన ఎంపీని మీ పూర్వికులు ఎవరు అని ప్రశ్నించానని, ఆయన తాము బాబర్ వంశస్తులు అని సమాధానం ఇచ్చారని, ర్యాలీలలో తాను మాట్లాడిన సమయంలో ఆయన్ను తాను బాబర్ కీ ఔలాద్ అన్నానని సీఎం యోగీ ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు.

బాబర్ మా వంశస్తులు అని చెప్పిన వారిని ఎన్నికల కమిష్ వదిలి పెట్టిందని, ఆ విషయంలో తాను మాట్లాడినందుకు తనకు నోటీసులు జారీ చేశారని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అసహనం వ్యక్తం చేశారు. బాబర్ మన దేశాన్ని లూటీ చేశారని, ఆయన వంశస్తులు ఆ సంపదను తిరిగి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారా అంటూ సమాజ్ వాది పార్టీ నేతలను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.

గతంలో భారత సైన్యాన్ని మోడీ కీ సేనా అని వ్యాఖ్యానించిన యోగీ ఆదిత్యనాథ్ కు 72 గంటల్లో సమాదానం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను విమర్శించాలని, వారికి భజన చెయ్యకూడదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.

English summary
Uttar Pradesh Chief Minister Adityanath defended his remark against a Samajwadi Party candidate, saying one goes on a dais to hit out at the Opposition and not to sing devotional songs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X