వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు పక్కన కాలిన గాయాలతో..నగ్నంగా డిగ్రీ విద్యార్థిని

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణ ఘటన సంభవించింది. ఉన్నవ్‌లో ఇద్దరు బాలికలు మృతదేహాలుగా కనిపించిన సంఘటనను విస్మరించక ముందే.. అలాంటి ఉదంతమే మరొకటి. ఓ యువతి జాతీయ రహదారి పక్కన కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న సంఘటన షాజహాన్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. లక్నో-ఢిల్లీ జాతీయ రహదారి పక్కన స్పృహ తప్పిన స్థితిలో కనిపించిన ఆ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం ఆమెను తొలుత లక్నోలని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్శిటీ, అనంతరం శ్యామాప్రసాద్ ముఖర్జీ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు.

జలాలాబాద్‌కు చెందిన బాధితురాలు స్వామి సుఖ్‌దేవానంద్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు గుర్తించారు. ఈ కళాశాల..కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద్ ట్రస్ట్‌కు చెందినది. తన తండ్రితో పాటు ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరి వెళ్లిన ఆమె.. మళ్లీ తిరిగి రాలేదు. సాయంత్రమైనప్పటికీ.. కుమార్తె ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అన్ని చోట్లా వెదికారు. ఆమె ఆచూకీ తెలియరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Uttar Pradesh: College Student Found With Severe Burns Along Highway

పోలీసుల గాలింపుల్లో.. నగారియా మోడ్ ప్రాంతంలో లక్నో-ఢిల్లీ జాతీయ రహదారి పక్కన నగ్నంగా.. కాలిన గాయాలతో బాధితురాలు స్పృహ తప్పిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సుమారు 60 శాతం మేర కాలిన గాయాలైనట్లు కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్శిటీ డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు షాజహాన్‌పూర్ ఎస్ఎస్‌పీ ఎస్ ఆనంద్ తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకోవడానికి గల కారణాల గురించి అన్వేషిస్తున్నామని అన్నారు. తండ్రి ఆమెన కళాశాల వదిలేసిన తరువాత ఆమెకు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు.

English summary
A girl student of a college run by a trust of former union minister Swami Chinmayanand was found lying without clothes and severely burnt along a national highway in Shahjahanpur district in Uttar Pradesh, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X