వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముజఫర్‌నగర్ అల్లర్ల కేసు ఉపసంహరణకు యోగి ప్లాన్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ముజఫర్ నగర్ అల్లర్ల కేసును ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కేసును ఎత్తివేయాలని యోగి మేజిస్ట్రేట్‌కు లేఖ రాసినట్టు ఓ ఆంగ్ల జాతీయ దినపత్రిక ప్రచురించింది.

2013లో జరిగిన అల్లర్లపై నమోదైన కేసును ఉపసంహరించడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.ఈ కేసు స్టేటస్‌పై జిల్లా మేజిస్ట్రేట్‌ను ప్రభుత్వం ఈ మేరకు సమాచారం కోరినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసును ఎత్తివేయాలని కోరుతూ ఓ లేఖను మేజిస్ట్రేట్‌కు రాసినట్లు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

కేవలం ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసుపై మాత్రమే కాకుండా.. బీజేపీ ఎమ్మెల్యే ఉమేశ్‌ మాలిక్‌పై ఉన్న మరో ఎనిమిది కేసులపై కూడా మేజిస్ట్రేట్‌ ఓపినియన్‌ను ప్రభుత్వం కోరిందని యూపీ అధికార వర్గాల్లో ప్రచార సాగుతుంది.. దీనిపై ఎమ్మెల్యే మాలిక్‌ను సంప్రదించగా ఆయనకు ఈ కేసుల ఎత్తివేత వ్యవహారంపై ఎలాంటి సమాచారం లేదని చెప్పారని ఆ పత్రిక ప్రకటించింది.

Uttar Pradesh considers withdrawing Muzaffarnagar riots case

తనతో పాటు బీజేపీ ఎంపీ భారతేంద్ర సింగ్‌, కేంద్ర మంత్రి సంజీవ్‌ బలియాన్‌, సాద్వీ ప్రచీలపై కూడా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఆగష్టు 31, 2013న మహాపంచాయత్‌ వద్ద ప్రచీ చేసిన ప్రసంగం తర్వాత ముజఫర్‌నగర్‌లో అల్లర్లు చెలరేగాయి.

వీరితో పాటు బీజేపీ నాయకులు థానా భవన్‌, షామిలీ, సార్ధానా సంగీత్‌ సింగ్‌ సోమ్‌, ఉత్తరప్రదేశ్‌ మంత్రి సురేశ్‌ రానా తదితరులపై కూడా ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసులు ఉన్నాయి.

English summary
The Yogi Adityanath government is learnt to be considering withdrawal of a case related to the 2013 riots in Muzaffarnagar, and has sought opinion of the district magistrate regarding its status
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X