వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2024వరకూ ఆశలొద్దు: మోడీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలనం, తొలి గెలుపు బీజేపీదే

ప్రస్తుతం దేశంలో మోడీని సవాల్‌ చేసే బలమైన నేత ఎవరూ లేరన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీ పోటీ ఇవ్వలేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. అందువల్ల విపక్షాలు 2019 ఎన్నికల గురించి మరిచిపోయి.. 2024 ఎన్నికల

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభంజనంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సునామీ సృష్టించిందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశంలో మోడీని సవాల్‌ చేసే బలమైన నేత ఎవరూ లేరన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీ పోటీ ఇవ్వలేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. అందువల్ల విపక్షాలు 2019 ఎన్నికల గురించి మరిచిపోయి.. 2024 ఎన్నికల గురించి ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరిమితమని, పంజాబ్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని అన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని తెలిపారు. మణిపూర్, గోవాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటుకుందని, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయిందని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు, రాజ్యసభ స్థానాలపై ప్రభావం చూపుతుందని అన్నారు.

modi-omar obdulla

ఐదు రాష్ట్రాల్లో తొలి గెలుపు బీజేపీదే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌ జిల్లాలోని దేవ్‌బంద్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బ్రిజేష్‌ గెలుపొందారు. మణిపూర్‌లో తౌబల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆ రాష్ట్ర సీఎం ఇబోబి సింగ్‌ తొలి విజయం నమోదు చేశారు. ఇక్కడ ఇరోం షర్మిల ఓటమి చవిచూశారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కన్వర్‌పాల్‌ సింగ్‌ ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

కాగా, గోవాలో ఎంజీపీ పార్టీ తొలి విజయం నమోదు చేసింది. సౌత్‌గోవాలోని శాన్‌వోర్డెమ్‌ నియోజకవర్గం నుంచి ఎంజీపీ అభ్యర్థి దీపక్‌ ప్రభు విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ తొలి విజయం నమోదు చేసింది. హరిద్వార్‌ జిల్లాలోని మంగళూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఖ్వాజీ మొహద్‌ నిజాముద్దీన్‌ విజయం సాధించారు.

English summary
The assembly election results today saw a piece of advice from Omar Abdullah, former Chief Minister Of Jammu and Kashmir. "At this rate we might as well forget 2019 & start planning/hoping for 2024," Abdullah tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X