వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్: యూపీలో మళ్లీ.. శుక్రవారం నుంచి సోమవారం వరకు, అత్యవసర సేవలకు మినహాయింపు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం) రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు పేర్కొన్నది. అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సంస్థలు/సముదాయాలు విధిగా మూసివేయాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర తివారీ ఉత్తర్వులు జారీచేశారు.

కరోనా వైరస్ సమూహ వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎస్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ సందర్భంగా పట్టణ/ గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు, మండీలు, కార్యాలయాలు మూసివేస్తారు. కానీ అత్యవసర సేవలు పాలు, కూరగాయాలు, మెడికల్ షాపు, బియ్యం దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయి. రైళ్ల రాకపోకలను కొన్నింటికీ అనుమతిస్తారు.

Uttar Pradesh govt imposes lockdown from July 10 till July 13..

Recommended Video

Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu

అయితే డోర్ డెలివరీ సేవలకు అనుమతి ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణాలపై కూడా ఆంక్షలు ఉండబోవన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పనులు కొనసాగుతాయని స్పష్టంచేశారు. యూపీలో 31 వేల 156 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉండగా.. 20 వేల 331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 9 వేల 980 మంది మాత్రమే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

English summary
Uttar Pradesh government has imposed a lockdown in the state starting 10 pm on Friday, July 10, till 5 am on July 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X