వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Road Romeo: అమ్మాయి చెయ్యిపట్టినా, ఆంటీకి కన్నుకొట్టినా మీ ఫోటోలకు దండం పెట్టేస్తారు, ఏక్ మార్ తీన్

|
Google Oneindia TeluguNews

లక్నో/ న్యూఢిల్లీ: యువతులు, వివాహిత మహిళలను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న కామాంధులకు చెక్ పెట్టాలని సీఎం నిర్ణయించారు. అమ్మాయి చెయ్యి పట్టుకోవాలని, ఆంటీలకు కన్ను కొట్టాలని ప్రయత్నిస్తే మీ ఫోటోలు గోడల మీద ప్రత్యక్షం కానున్నాయి. అమ్మాయిలను, ఆంటీలను ఆటపట్టించాలని ఆలోచన వచ్చినా మీ ఫోటోలకు దండం పెట్టడానికి ప్రత్యేక టీమ్ లు సిద్ద అయ్యాయి. అమ్మాయిలు, వివాహిత మహిళల రక్షణ కోసం 'ఆపరేషన్ దురాచారి' అనే ప్రత్యేక బలగాలు ఏర్పాటు చెయ్యాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ దురాచారి నిర్వహణ బాధ్యతలను మహిళా పోలీసు అధికారులకు అప్పగించడంతో ఇంతకాలం రోడ్ల మీద రెచ్చిపోతున్న రోడ్డు రోమియోలకు ప్యాంట్లు తడిచిపోవడానికి ఇలా ప్లాన్ సిద్దం చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

 నిద్రలేస్తే నేరాలు... ఘోరాలు

నిద్రలేస్తే నేరాలు... ఘోరాలు

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల కాలంలో నేరాలు.... ఘోరాలు ఎక్కువ అవుతున్నాయని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ప్రతిరోజు ఎక్కడో అక్కడ అమ్మాయిలపై లైంగిక వేధింపులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, హత్యలు ఇలా నిద్రలేచినప్పటి నుంచి ఏదోఒక ప్రాంతంలో క్రైమ్ లు జరుగుతున్న విషయం వెలుగు చూస్తూనే ఉంది.

 సీఎం యోగీ సీరియస్

సీఎం యోగీ సీరియస్

అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. ఇక ముందు మన రాష్ట్రంలో ఎక్కడా మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయి ? అనే వార్త వినపడకూడదని ఆ రాష్ట్ర హోమ్ శాఖ అధికారులు, పోలీసు అధికారులకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

 ఆపరేషన్ దురాచారి

ఆపరేషన్ దురాచారి

రోడ్లమీద అమ్మాయిలు కనపడితే చెయ్యిపట్టుకుని వేధింపులకు గురి చెయ్యడం, ఐలవ్ యూ అంటూ వెంటపడి మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చెయ్యడం ఎక్కువ అవుతున్నాయి. ఇక వివాహిత మహిళలు, ఆంటీలు కనపడితే కొందరు కామాంధులు కన్ను కొట్టి సైగలు చేసి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలకు కళ్లెం వెయ్యాలని ఉత్దరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ దారాచారి అనే పేరుతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వారి ఆటకట్టించాలని ఉత్దరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర హోమ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 అమ్మాయి చెయ్యి పట్టినా, ఆంటీలకు కన్ను కొట్టినా !

అమ్మాయి చెయ్యి పట్టినా, ఆంటీలకు కన్ను కొట్టినా !

రోడ్ల మీద అమ్మాయిలు కనపడితే వారి చేతులు పట్టుకుని ఏడిపించినా, వివాహిత మహిళలు, ఆంటీలకు కన్నుకొట్టి సైగలు చేసి వారిని శారీరకంగా, మానసికంగా హింసించినా వారి ఫోటోలను గోడల మీద అతికించి పోస్టర్లు వెయ్యాలని, ఇలాంటి అల్లరిమూకల ఆగడాలు సమాజం మొత్తం తెలిసిపోయేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హోమ్ శాఖ, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ముందు అమ్మాయిలు, వివాహిత మహిళల వైపు కన్నెత్తిచూడాలన్నా అందరికి ధడపుట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 రోడ్డు రోమియోలకు గుండు కొట్టి ముఖానికి మసిపూసి !

రోడ్డు రోమియోలకు గుండు కొట్టి ముఖానికి మసిపూసి !

మహిళల రక్షణ కోసం, వారిని వేధింపులకు గురి చేస్తున్న కామాంధుల ఆట కట్టించడం కోసం 2017లో ఉత్దరప్రదేశ్ లో రోమియో నిర్మూలనా ధళం ఏర్పాటు చేశారు. రోడ్ల మీద అమ్మాయిలు, మహిళలను వేధింపులకు గురి చేసేవారికి బహిరంగంగా గుండకొట్టడం, వారి ముఖాలకు మసిపూయడం, బహిరంగ ప్రదేశాలు, నడిరోడ్డు మీద వారితో గుంజీలు తీయించడం చేశారు.

 హైకోర్టు జోక్యంతో వెనక్కి

హైకోర్టు జోక్యంతో వెనక్కి

గత ఏడాది అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన హింసారాన్ని అరికట్టడానికి ఉత్దరప్రదేశ్ ప్రభుత్వం అల్లరిమూకల ఫోటోలను పోస్టర్లు వేయించి బహిరంగ ప్రదేశాల్లోని గోడల మీద అతికించారు. అయితే అల్లరిమూకల ఫోటోలను బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు వెయ్యకూడదని, వెంటనే ఆ పోస్టర్లను తొలగించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత గోడల మీద ఉన్న అల్లరిమూకల పోస్టర్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది.

 కలలో కూడా ఊహించరాదు

కలలో కూడా ఊహించరాదు

ఇప్పుడు మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ దురాచారి కారణంగా వివాదాలు తెర మీదకు రాకుండా ఉత్దరప్రదేశ్ ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఆపరేషన్ దురాచారి నిర్వహణ బాధ్యతలను సిన్సియర్ మహిళా పోలీసులకు అప్పగించింది. ఉత్దరప్రదేశ్ లోని అన్ని నగరాలు, పట్టణాలలో అన్ని రోడ్ల మీద, సిర్కిల్స్ లో ఆపరేషన్ దురాచారి ప్రత్యేక టీమ్ లు నిఘా వేసి రోడ్డు రోమియోలుకు తగిన బుద్ది చెప్పడానికి సిద్దం అయ్యాయి. కలలో కూడా అమ్మాయిలు, మహిళలను వేధించకూడదు అనే విధంగా రోడ్డు రోమియోలకు బుద్ది చెబుతామని ఉత్తరప్రదేశ్ పోలీసులు అంటున్నారు.

English summary
Road Romeo: Yogi Adityanath government in Uttar Pradesh has decided to lanch Operation Durachari to tackle the crime against women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X