వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబులెన్స్‌పై రాళ్ల దాడులు..ధ్వంసం: కరోనా అనుమానితుల ఘాతుకం: పోలీసు వాహనాలనూ వదల్లేదుగా..

|
Google Oneindia TeluguNews

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా డాక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, నర్సులపై తరచూ దాడుల పర్వం కొనసాగుతూనే వస్తోంది. కొద్ది రోజుల కిందటే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా వైరస్ అనుమానితులకు వైద్య పరీక్షలను నిర్వహించడానికి వెళ్లిన ఇద్దరు మహిళా డాక్టర్లు, నర్సులను తరిమి కొట్టిన ఘటనను విస్మరించకముందే- అదే తరహా దాడి ఘటన ఈ సారి ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

మొరదాబాద్‌లో కొందరు కరోనా వైరస్ బారిన పడినట్లుగా అనుమానిస్తోన్న వారిని వైద్య పరీక్షలు నిర్వహించడానికి అంబులెన్స్‌లో వెళ్లిన డాక్టర్లు, నర్సులను సహకరించడానికి నిరాకరించారు అక్కడి స్థానికులు. వైద్య పరీక్షలను నిర్వహించడానికి వచ్చిన డాక్టర్లను ప్రతిఘటించారు. వారిపై దాడులకు పాల్పడ్డారు. రాళ్ల వర్షాన్ని కురిపించారు. ఇటుకలతో దాడి చేశారు. అంబులెన్స్‌ అద్దాలను ధ్వంసం చేశారు. టైర్లల్లో గాలిని తీసి వేశారు.

Uttar Pradesh: Health workers, police officials attacked by mob in Moradabad

ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే పరిస్థితులను అదుపు చేయడానికి వెళ్లిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. మొరదాబాద్‌లోని హాజీ నెబ్ మసీదు ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. హాజీ నెబ్ మసీదు ప్రాంతంలో కొందరు కరోనా వైరస్ అనుమానితులు తలదాచుకుంటున్నారని, వారికి స్థానికులు ఆశ్రయం ఇచ్చినట్లు తెలియడంతో మొదట డాక్టర్లు, నర్సులు సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లో బయలుదేరి వెళ్లారు.

కొందరు కరోనా వైరస్ అనుమానితులకు పరీక్షలను నిర్వహించడానికి ప్రయత్నించారు. వైరస్ సోకినట్లుగా అనుమానం ఉన్న వారు వెంటనే బయటికి రావాలని, పరీక్షలను నిర్వహించుకోవాలని సూచించారు. తమకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. దీనికి వారు స్పందించలేదు. దీనితో డాక్టర్లు అనుమానితుల ఇళ్లకు వెళ్లడానికి ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి వైరస్ సోకలేదని, ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదని, వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు.

Uttar Pradesh: Health workers, police officials attacked by mob in Moradabad

కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులను వివరించడానికి ప్రయత్నించగా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబులెన్స్‌పై రాళ్ల దాడులు చేశారు. ఇటుకలను విసిరారు. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ గాయపడ్డాడు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిపైనా రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనం కూడా ధ్వంసమైంది. ఈ ఘటన పట్ల మొరాదాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Recommended Video

World's 30 Most Polluted Cities : 21 Indian Cities, Ghaziabad Tops List

English summary
A team of health workers and police personnel were attacked by a mob after they had gone for a medical check-up for coronavirus suspects in Uttar Pradesh's Moradabad. According to health officials, a thousand people came out on the streets to attack the medical team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X