వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టుకున్న భార్య తలను నరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త..అక్కడ ఏం జరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

బారాబంకి: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం కాపాడుకుంటానని పెళ్లి సమయంలో ప్రమాణం చేసిన భర్త.. మాట తప్పాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో చోటుచేసుకుంది. జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బహదూర్ పురా గ్రామంకు చెందిన అఖిలేష్ రావత్‌కు అతని భార్య మధ్య గొడవ జరిగింది. తీవ్ర వాగ్వాదం జరగడంతో సహనం కోల్పోయిన అఖిలేష్ తన భార్య తలను నరికేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సరెండర్ అయ్యాడు.

పట్టపగలే జరిగిన ఈ హత్యతో బహదూర్ పురా గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భార్య తల నరికి మొండెం నుంచి వేరు చేసి ఆ తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు అఖిలేష్.గ్రామం గుండా తలతో పాటు నడుచుకుంటూ వెళుతుండగా గ్రామస్తులు చూసి భయపడ్డారు. ఇక నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సరెండర్ అయ్యాడు. ఇక పోలీసులు అఖిలేష్ చేతిలో ఉన్న తలను తీసుకునేందుకు ప్రయత్నించగా అఖిలేష్ జాతీయగీతంను ఆలపించాడు. ఆ తర్వాత భారత్ మాతా కీ జై అంటూ నినదించాడు. ముందుగా తలను ఇచ్చేందుకు నిరాకరించిన అఖిలేష్ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగాడు. అనంతరం పోలీసులు అఖిలేష్ నుంచి భార్య తలను స్వాధీనం చేసుకున్నారు.

Uttar Pradesh man murders wife and walks to Police station with her head

ఇదిలా ఉంటే అఖిలేష్ అతని భార్య మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోందని ఎస్పీ అరవింద్ చతుర్వేది చెప్పారు.ఈ క్రమంలోనే అఖిలేష్ తన భార్య తలను నరికేశాడని చెప్పిన ఎస్పీ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పాడు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారుతోంది. గతేడాది కోర్టుకు వెళుతున్న అత్యాచార బాధితురాలిపై కొందరు అటాక్ చేసి ఆమెకు నిప్పంటించడంతో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది.

English summary
A man in UP's Barabanki murdered his wife, severed his wife's head and walked to the police station and sang National Anthem before he was arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X