వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిషేధం: ఆ గ్రామాల్లో అమ్మాయిలకు నో జీన్స్, నో ఫోన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ముస్లిం గ్రామ పంచాయత్ బాలికల వస్త్రధారణపై ఆంక్షలు విధించింది. బాలికలు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్స్ ధరించకూడదని, మొబైల్ ఫోన్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ముజఫర్‌నగర్‌, సహారన్‌పూర్‌ జిల్లాల్లోని పది గ్రామాల్లో ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ నిషేధాజ్ఞలపై పంచాయత్ ప్రసిడెంట్ మహ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ జీన్స్‌ ధరించడం, సెల్‌ఫోన్స్‌ వినియోగించడం వల్ల ఆడవారిపై అఘాయిత్యాలు, నేరాలు మరింతగా పెరిగిపోతున్నాయన్నారు.

ఈ ఆంక్షల వల్ల మహిళలపై కొంత వరకైనా అఘాయిత్యాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఇస్లాం ప్రకారం పెళ్లి కాని బాలికలు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్స్ ధరించకూడదనే నిబంధన ఉందన్నారు. తమగ్రామాల్లోకి వచ్చే బాలికలు కూడా ఈ నిబంధనలను పాటించాల్సి ఉందన్నారు.

Uttar Pradesh: Muslim village panchayat bans jeans, mobile phones for girls

తాము విధించిన ఈ నిబంధనలపై ఎవరికైనా వ్యతిరేకత ఉంటే తమని కలవవచ్చని, వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని 17 మంది సభ్యులతో కూడిన పంచాయత్ పేర్కొంది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి గ్రామ నుంచి బహిష్కరిస్తామన్నారు.

అయితే పెళ్లైన మహిళలు మాత్రం మొబైల్ ఫోన్‌ను వినియోగించవచ్చని, బాలికలు, పెళ్లికాని మహిళలు మాత్రం వీటిని వినియోగించకూడదని పంచాయిత్ సభ్యులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వీటితో పాటు వరకట్నంపై కూడా ఆంక్షలు విధించారు.

English summary
A Muslim village panchayat in Uttar Pradesh has issued a diktat that bans girls from using mobile phones and wearing jeans and T-shirts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X