వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లాస్ రూమ్‌లో దర్జాగా.. సిగరెట్ కాల్చిన టీచర్, చివరకు..!

|
Google Oneindia TeluguNews

లక్నో : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విచక్షణ లేకుండా తరగతి గదిలో వింత మనిషిలా ప్రవర్తించాడు. స్టూడెంట్స్ చూస్తున్నారనే ఇంగీత జ్ఞానం లేకుండా సిగరెట్ కాల్చాడు. కాలు మీద కాలేసుకుని దర్జాగా పొగ తాగుతూ వివాదస్పదంగా మారాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు గురువు గారి లీలలు బయటపడ్డాయి.

టీచరంటే సమాజంలో ఎంతో గౌరవం. అలాంటి వృత్తికి మచ్చ తెచ్చేలా వ్యవహరించిన సదరు ఉపాధ్యాయుడిపై నెట్టింట్లో షంటింగ్ తప్పడం లేదు. ఈ గురుడిపై నెటిజన్లు నోటికి ఎంతొస్తే అంత అనేస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువే ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమేంటనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో ట్విస్ట్.. నగలు దోచాడు.. నటితో పరారయ్యాడు..!ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో ట్విస్ట్.. నగలు దోచాడు.. నటితో పరారయ్యాడు..!

uttar pradesh teacher suspended for smoking in class room

యూపీలోని మహ్మదాబాద్ ప్రాంతంలో ప్రైమరీ స్కూల్ టీచర్ క్లాస్ రూమ్‌లో పొగ తాగిన విజువల్స్‌ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అది కాస్తా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన కింది స్థాయి అధికారులను విచారణకు పురమాయించారు. సదరు అధికారులు ఆ స్కూల్‌కు వెళ్లి విచారించగా.. ఆ వీడియోలో ఉన్న టీచర్ అక్కడే విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

తరగతి గదిలో దర్జాగా సిగరెట్ కాల్చిన సదరు టీచర్‌పై విద్యాశాఖ అధికారులు గరమయ్యారు. విధి నిర్వహణలో ఇలా చేయడమేంటని తలంటారు. ఆ మేరకు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అప్పటికప్పుడు ఎంఈవో అజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ ఆవరణలో పొగ తాగరాదనే నిబంధన అమలు చేస్తున్న క్రమంలో.. ఏకంగా క్లాస్ రూమ్‌లో సిగరెట్ కాల్చిన ఉపాధ్యాయుడి ప్రవర్తన క్షమించరాని విషయమన్నారు. మొత్తానికి ఆ గురుడిని సస్పెండ్ చేయడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

English summary
A teacher of a primary school in Mahmudabad was suspended after a purported video of him smoking inside the classroom went viral on social media. District Basic Education Officer Ajay Kumar told that.. I suspended him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X