Lovers: ప్రియురాలితో పెళ్లికి నో, అమ్మాయి, ఆంటీని చంపేసిన ప్రియుడు, నాకు దక్కంది !
లక్నో/ బెంగళూరు: పక్కింటిలో నివాసం ఉంటున్న ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు ఉబలాటపడ్డాడు. అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు నానాతంటాలు పడ్డాడు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు గోవింద్ కు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు. నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యనుపోరా అంటూ అమ్మాయి తల్లి రెచ్చిపోయింది. వేరే యువకుడితో ఆ అమ్మాయి నిశ్చితార్థం చేశారు. నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదు అంటూ రెచ్చిపోయిన యువకుడు పదునైన కత్తి తీసుకుని ప్రియురాలు, ఆమె తల్లిని ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేశాడు. అడ్డువచ్చిన వాళ్ల బంధువును ప్రియుడు కత్తితో దారుణంగా పోడచడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది.
Illegal affair: ఇద్దరు భర్తలు, ఇద్దరికీ జామకాయ, పార్ట్ టైమ్ లవర్ తో అడ్డంగా చిక్కి !

ఆగ్రా లవ్ స్టోరీ
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలోని ఓ గ్రామంలో గోవింద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గోవింద్ నివాసం ఉంటున్న ఊరిలోనే, అతని పక్కింటిలోనే 19 ఏళ్ల రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. చాలాకాలం నుంచి రష్మీ మీద మనసుపడిన గోవింద్ ఆమెను ఎలాగైనా ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు.

పెళ్లి తెచ్చిన తంటాలు
రిష్మీని పెళ్లి చేసుకోవాలని గోవింద్ అనేక ప్రయత్నాలు చేశాడు. చివరి ఒకే వీధిలో నివాసం ఉంటున్న గోవింద్, రష్మీలు ప్రేమించుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రష్మీ గోవింద్ ను కలిసేది. గోవింద్, రష్మీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేశారు. అయితే మా ఇంట్లో అంగీకరిస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని రష్మీ తేల్చిచెప్పింది.

ఎగిరెరిగి పడిన ఆంటీ
రష్మీ, గోవింద్ వ్యవహారం వాళ్ల ఇళ్లలో తెలిసిపోయింది. గోవింద్, రష్మీల పెళ్లి చెయ్యడానికి రెండు కుటంబాలు నిరాకరించాయి. ఇదే విషయంలో కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యనని, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకోపోరా అంటూ రష్మీ తల్లి గోవింద్ ను నానా బూతులు తిట్టింది.

నిశ్చితార్థంతో హడల్
రష్మీకి వేరే యువకుడితో గుట్టుచప్పుడు కాకుండా బంధువు ఇంట్లో పెళ్లి నిశ్చితార్థం జరిపించేశారు. ఈ విషయం ఆలస్యంగా గోవింద్ కు తెలిసింది. వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన రష్మీ గోవింద్ పక్క చూడటం మానేసింది. రష్మీ వేరేవ్యక్తికి భార్య అవుతుందోని, నాకు దక్కదని గోవింద్ హడలిపోయాడు.

ప్రియురాలి హత్యకు స్కెచ్
నాకు దక్కంది ఎవ్వరికీ దక్కకుండా చెయ్యాలని గోవింద్ డిసైడ్ అయ్యాడు. చివరిసారి రష్మీ మనసు మార్చాలని గోవింద్ రాత్రి ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి ప్రయత్నించాడు. అది వీలుకాకపోవడంతో ప్రియురాలు రష్మీని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. రష్మీని పట్టుకున్న గోవింద్ కత్తి తీసుకుని ఆమెను కసకసా పోడిచేశాడు.

ఆంటీని వదల్లేదు
అడ్డు వచ్చిన రష్మీ తల్లిని గోవింద్ కత్తితో పొడిచేశాడు. అదే సమయంలో రష్మీ బంధువు అయిన ఓ వ్యక్తి గోవింద్ ను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అతన్ని గోవింద్ కత్తితో పోడిచేశాడు. రష్మీ, ఆమె తల్లికి తీవ్రగాయాలు కావడంతో రక్తం ఎక్కువ పోయి వారి ప్రాణాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

చంపేసి చెక్కేసిన గోవింద్
రష్మీ బంధువు పరిస్థితి విషయంగా ఉందని, ప్రియురాలు, ఆమె తల్లిని హత్య చేసిన గోవింద్ పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని ఆగ్రా ఐజీపీ సతీష్ గణేషన్ మీడియాకు చెప్పారు. ప్రేమించిన వ్యక్తి చేతిలో ప్రియురాలు, ఆమె తల్లి దారుణహత్యకు గురికావడం ఉత్తరప్రదేశ్ లో కలకం రేపింది.