• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొన్న ఢిల్లీ..నిన్న కర్ణాటక: లాక్‌డౌన్‌లో మరో పెద్ద రాష్ట్రం: రేపటి నుంచే: గైడ్‌లైన్స్ ఇవే

|

లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తన కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పల్లా వచ్చి పడుతున్నాయే తప్ప.. ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రోజువారీ కరోనా వైరస్ కేసులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తాజాగా నాలుగు లక్షలకు చేరువ అయ్యేలా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,79,257 నమోదు కావడం మాటలు కాదు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్.. వంటి రాష్ట్రాల్లో వేలల్లో కొత్త కేసులు పుట్టుకుని రావడమే దీనికి కారణం.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రెండు రాష్ట్రాలు సంపూర్ణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, కొన్నిచోట్ల వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్‌ మల్లో ఉంటోంది. ఢిల్లీ, కర్ణాటక సంపూర్ణ లాక్‌డౌన్‌లోకి వెళ్లగా.. మరో రాష్ట్రం వాటితో జత కలవనుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో లాక్‌డౌన్ అమలు కానుంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి అయిదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణంగా లాక్‌డౌన్ విధించనున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

Uttar Pradesh will go under complete lockdown starting April 30

ఈ నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి 8 గంటల నుంచి మే 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కంప్లీట్ లాక్‌డౌన్‌ను విధించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించనా కఠిన చర్యలను తీసుకుంటామని పేర్కొంది. నిత్యావసర సరుకులు, పాలు, వైద్య సేవలు, ఫార్మసీ షాపులు వంటి అత్యవసర సర్వీసులతో పాటు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి మినహాయింపు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.

Uttar Pradesh will go under complete lockdown starting April 30
  TRS Party Formation Day: 14 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ - Party Leaders

  కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీన్ని మరింత విస్తరించింది. శని, ఆదివారాలకు మాత్రమే పరిమితం చేయకుండా.. మరికొంత పొడిగించింది. మంగళవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగించనుంది. బుధవారం సాయంత్రం యూపీ సర్కార్ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఆ రాష్ట్రంలో కొత్తగా 29,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 11,82,848 చేరింది. యాక్టివ్ కేసులు 3,00,041కి చేరాయి. 11,943 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో వీకెండ్ లాక్‌డౌన్‌ను మరింత విస్తరింపజేసింది.

  English summary
  Amid the rise in Covid-19 cases, Uttar Pradesh will go under complete lockdown starting April 30 evening till 7 am on 4 May. "Lockdown in the state will now remain imposed from Friday evenings to 7 am on Tuesdays. The decision has been taken in the wake of COVID19 situation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X