• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

BJP ముఖ్యమంత్రులంతా ఇంతేనా? -Uttarakhand కొత్త సీఎం పుష్కర్ ధామీకి మ్యాప్‌ కష్టాలు

|

ముఖ్యమంత్రులను మార్చేయడంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం తీసిపోని విధంగా బీజేపీ హైకమాండ్ వ్యవహరిస్తున్నది. దేవభూమి ఉత్తరాఖండ్ లో నాలుగు నెలల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చేసిన బీజేపీ.. నాటి కాంగ్రెస్ తీరును తలపిస్తున్నది. విచిత్రం కాకపోతే, బీజేపీ నుంచి ముఖ్యమంత్రులైన ఆ ముగ్గురు నేతలూ అనూహ్య వివాదాస్పదులే కావడం గమనార్హం. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే పుష్కర్ సింగ్ ధామీ వివాదంలో చిక్కుకున్నారు..

జల వివాదం: సజ్జల సీరియస్ వార్నింగ్ -ఇచ్చింది కేసీఆర్‌కా? వైసీపీ నేతలకా? -ఈనెల 9న రచ్చేజల వివాదం: సజ్జల సీరియస్ వార్నింగ్ -ఇచ్చింది కేసీఆర్‌కా? వైసీపీ నేతలకా? -ఈనెల 9న రచ్చే

పదవిలో ఉన్నంత కాలం విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన త్రివేంద్ర సింగ్ రావత్.. ఆ మధ్య 'కరోనా కూడా జీవే కాబట్టి, దానికి కూడా ఈ భూమ్మీద బతికే హక్కుంద'ని సెలవిచ్చారు. త్రివేంద్ర తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ రెండో రోజే మహిళల వస్త్ర ధారణపై, ఎంత మంది పిల్లల్ని కనాలనేదానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ ఎంపీ అయిన తీరత్.. సరిగ్గా 115 రోజులు మాత్రమే సీఎంగా పనిచేసి, రాజ్యాంగ సంక్షోభం నుంచి తప్పుకునేందుకే పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీఎంగా ఎంపికైన పుష్కర్ ధామీ సైతం తక్కువవారేమీ కాదు..

 Uttarakhand bjp New CM Pushkar Singh Dhami In Map Controversy As He Takes Over

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామీ ఆదివారం ప్రమాణం చేశారు. వర్షం కురుస్తుండగా, డెహ్రాడూన్ లోని రాజ్ భవన్ లో సాదా సీదాగా ఆయన ప్రమాణస్వీకారం జరిగింది. కాగా, బీజేపీ హైకమాండ్ పుష్కర్ ను సీఎంగా ప్రకటించినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన వివాదం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..

షాకింగ్: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కొడుకు ఆత్మహత్యాయత్నం -గాలి ఫ్యామిలీ బెదిరింపులు?షాకింగ్: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కొడుకు ఆత్మహత్యాయత్నం -గాలి ఫ్యామిలీ బెదిరింపులు?

కట్టర్ హిందూవాది, ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన పుష్కర్ సింగ్ ధామీ.. ఆరేళ్ల క్రితం అఖండ్‌ భారత్ పేరిట చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ మ్యాప్ లో ప్రస్తుత భారత భూభాగాలు లేకపోవడం వివాదానికి కారణమైంది. దీంతో ఆ ట్వీట్‌ను నెటిజన్లు ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు. గత ముఖ్యమంత్రులు త్రివేంద్ర, తీరత్ లనూ ప్రస్తావిస్తూ, 'బీజేపీ సీఎంలు అందరూ ఇంతేనా?' తరహా కామెంట్లతో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

 Uttarakhand bjp New CM Pushkar Singh Dhami In Map Controversy As He Takes Over
  IMA Sends Rs 1,000 Cr Defamation Notice To Ramdev | Allopathy | Patanjali || Oneindia Telugu

  2015లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అఖండ్‌ భారత్‌ కల సాకారం కావాలని పేర్కొంటూ ఈ మ్యాప్‌ను పుష్కర్‌సింగ్‌ అప్పట్లో ట్వీట్‌ చేశారు. ఆ మ్యాప్‌లో భరతమాత మధ్యలో ఉండగా... ఇరుగుపొరుగు దేశాలు అందులో ఉన్నాయి. అయితే భారత్‌లో అంతర్భాగంగా ఉన్న లద్దాఖ్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాలు లేకపోవడంతో నెటిజన్లు ఆ ట్వీట్‌ను వైరల్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కొత్త సీఎంపై మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని పుష్కర్‌ సింగ్‌ ఈ మ్యాప్‌ ద్వారా ఒక్కరోజులోనే వైరలైపోయారు..

  English summary
  New Uttarakhand Chief Minister, the BJP's Pushkar Singh Dhami, waded into controversy even before he took oath because of a map of India he tweeted six years ago. The map, purportedly showing "Akhand Bharat (undivided India)" at some point in history, had missed out key parts of present-day India. Twitter users lost no time in digging out the post, pointing out that the Indian map, demarcated by a white line on the red "Akhand Bharat" background, left out parts of Ladakh and the areas currently occupied by Pakistan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X