వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ సీఎం హోం క్వారంటైన్, మిగతా మంత్రులు కూడా, ఎందుకంటే...?

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే 8 వేల పైచిలుకు కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో వైరస్ బారినపడిన వారి సంఖ్య లక్ష 80 వేల మార్క్ దాటింది. మరోవైపు మంత్రులు, ముఖ్యమంత్రులకు కూడా వైరస్ సోకుతోంది. కరోనా వైరస్ సోకిన మంత్రి.. క్యాబినెట్ మీటింగ్‌కు హాజరయ్యాడు. దీంతో సీఎం కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

ఉత్తరాఖండ్ మంత్రి ఫ్యామిలీకి వైరస్ సోకింది. అతని భార్యకు వైరస్ సోకడంతో ఆదివారం ఆస్పత్రిలో చేరారు. తర్వాత మంత్రి రుషికేష్ ఎయిమ్స్‌లో జాయిన్ అయ్యారు. అతనికి కూడా వైరస్ వచ్చిందని రుషికేష్ వైద్యులు ధృవీకరించారు. మంత్రి భార్యకు శనివారం పరీక్ష చేయగా వైరస్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు వారింట్లో ఉంటోన్న 41 మంది నుంచి కూడా రక్త నమూనాలను కూడా సేకరించారు.

Uttarakhand Chief Minister, Other State Ministers Under Home Quarantine..

Recommended Video

COVID-19 Cases Crossed 3045 Mark In AP, 98 New Cases Registered In 24Hrs

అయితే శుక్రవారం ఉత్తరాఖండ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. మీటింగ్‌కు సదరు మంత్రి హాజరయ్యారు. అయితే అప్పటికే అతని భార్య, అతనికి కూడా వైరస్ ఉండటంతో.. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అతనితోపాటు మంత్రివర్గ సమావేశానికి హాజరైన వారు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

English summary
Uttarakhand Chief Minister Trivendra Singh Rawat and other ministers who attended a cabinet meeting on May 29 has been placed under home quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X