వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది నేనే: స్టింగ్ ఆపరేషన్‌పై ఎట్టకేలకు మాజీ సీఎం హరీశ్

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: తనపై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీ నకిలీదని ఇప్పటివరకూ వాదించిన ఉత్తరాఖండ్ పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ ఆ వీడియోలో ఉన్నది తనేనని ఎట్టకేలకు అంగీకరించారు.

అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలకు డబ్బు లేదా ఇతర సాయంపై సీడీలో ఆధారాలుంటే ప్రజల సమక్షంలో ఉరికి సిద్ధమని ఆవేశంగా మాట్లాడారు. దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు సవాల్ విసిరారు.

క్లాక్‌టవర్ వద్ద తనను ఉరితీయాలని ఆదివారమిక్కడ అన్నారు. 'విలేకరితో లేదా ఎమ్మెల్యేతో భేటీ నేరమా? వీడియోలో చూపిన సంభాషణలు అర్థరహితంగా ఉన్నాయి. అప్పటికి అనర్హతకు గురవ్వని ఎమ్మెల్యేతో మాట్లాడటం తప్పెలా అవుతుంది?. ఆ ఎమ్మెల్యేలను కొంటున్నట్లు ఏమైనా మాట్లాడానా?' అని హరీశ్ రావత్ ప్రశ్నించారు.

Uttarakhand crisis: Harish Rawat accepts his ‘presence’ in sting CD

'ఎవరైనా సరే ఎందుకు తన కోసం రూ.15 కోట్లు ఖర్చుపెట్టాలి? విలేకరి తనతో ఏదో మాట్లాడగా.. తాను దానికి సమాధానమిచ్చాను' అని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ సీడీని ఒక ప్రైవేట్ వార్తా చానల్ చీఫ్ ఎడిటర్ తయారుచేయించారని ఆరోపించారు.

కాగా, అభియోగాలు నమోదైన నేపథ్యంలో సిబిఐ ప్రాథమిక విచారణను ప్రారంభించిన రెండ్రోజులకు మాజీ సీఎం స్పందించారు. కాగా, స్టింగ్ ఆపరేషన్‌ను కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు మార్చి 26న విడుదల చేశారు.

English summary
FORMER Uttarakhand chief minister Harish Rawat Sunday said he never denied meeting the journalist who is purportedly shown in a sting operation negotiating a deal with him to buy the support of Congress rebel MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X