వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్: కొండ పల్లెల వలసలు.. ఏండ్ల తరబడి పెండింగ్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బౌండుల్ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఎత్తైన కొండ ఎక్కి తమ సొంత గ్రామానికి వెళ్లనున్నారు.

By Swetha Basavababu
|
Google Oneindia TeluguNews

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బౌండుల్ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఎత్తైన కొండ ఎక్కి తమ సొంత గ్రామానికి వెళ్లనున్నారు. వారంతా వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళతారు. దట్టమైన అడవుల మధ్య వారి ప్రయాణం సాగుతుంది.

కొండ కింద నుంచి వయోజనులు ఎత్తున ఉన్న ప్రదేశాల్లో పనికోసం వెళతారు. వారి ప్రయాణం దట్టమైన అడవుల మధ్య నిత్యం ప్రమాదాలతో సహవాసమే మరి. యువత అంతా బయలుదేరి వెళ్లడంతో గ్రామాలన్నీ అంతా ఖాళీగా మారుతుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 88 శాతం గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంటుందంటే అతిశేయోక్తి కాదు.

ముంబై, డెహ్రడూన్, హరిద్వార్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా అవసరమైతే అత్తెసరు వేతనాలకు పని చేయాల్సిందే. తరతరాలుగా కొండ ప్రాంత పల్లెల వాసులు సమస్యలతో సతమమవుతున్నా ప్రధాన పార్టీలకు చీమ కుట్టినట్లయినా లేదు. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఓట్లు పొందేందుకు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించి తమ పని ముగిసిన తర్వాత ఈ ప్రాంతాల మొహం చూడరన్న విమర్శ ఉంది.

Uttarakhand elections: Migration a key poll issue in villages drained of villagers

'ఒకవేళ నేను ఒంటరిగా అడవి గుండా వెళితే నాపై చిరుత పులి దాడిచేసే అవకాశం ఉంది' అని బౌండుల్ గ్రామ వాసి బునాదేవి వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రమాదాలేవీ వారిని ఓటేయకుండా అడ్డుకోలేవు. ఎటువంటి కష్టాల్లోనైనా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. తాము వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవిర్బావం నుంచి మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయబోతున్నానని స్థానికులు చెప్తున్నారు. ప్రతిసారి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తూనే ఉందని బునాదేవితోపాటు మరో ఇద్దరు మహిళలు చెప్పారు.

ఉపాధి కోసం 88 శాతం కొండ గ్రామాల వాసుల వలసలు
బౌండుల్ గ్రామం పౌరి జిల్లాలోని 341 పల్లెల్లో ఒకటిగా ఉంది. దీంతోపాటు గార్వాల్ ప్రాంతంలో ఇటువంటి గ్రామాలు 664 ఉంటాయి. మొత్తం ఉత్తరాఖండ్ రాష్ట్రమంతా 1110 కొండ ప్రాంత గ్రామాల్లో (88 శాతం) పరిస్థితులు చాలా దారుణంగా, అద్వాన్నంగా ఉంటాయి. ఈ గ్రామాల్లో ఒక్క యువకుడుగానీ, యువతి గానీ ఇండ్లలో ఉండరంటే అతిశేయోక్తి కాదు. తమ సొంత గ్రామాల్లో పని లేక, ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లడం ఈ పల్లెటూళ్ల ప్రజలకు తప్పనిసరి పరిణామంగా ఉన్నది.

పార్టీలకు ప్రచారాస్త్రంగా వలసలు

ప్రతి అసెంబ్లీ, లోక్ సభా ఎన్నికల్లోనూ ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంత ప్రజల వలసల సమస్య రాజకీయ పార్టీలన్నింటికీ ఒక ప్రచారాస్త్రంగా ఓట్లు కురిపిస్తూనే ఉంది తప్ప.. ఇప్పటివరకు దీని పరిష్కారానికి ఒక్క ఆదారం కూడా చూపలేకపోయాయి. తొలితరం ప్రజల్లో మొదటి బ్యాచ్ బయలుదేరి వెళ్లి మైదాన ప్రాంతాల్లో తోటల్లో పనిచేస్తుంటారు. మిగతా వారు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఆదాయం సంపాదనపై ద్రుష్టి సారించారు.

పంట పొలాలపై వన్యప్రాణుల దాడి

పంట పొలాల అంతటా పైన్ మొక్కలు విస్తరించి ఉండటంతో వాటిపై తిష్ట వేసి కోతులు రైతులు సాగుచేసిన పంట పొలాలను ధ్వంసం చేస్తాయని బాలోరి గ్రామ్ ప్రధాన్ బీర్బల్ సింగ్ తెలిపారు. ఈ గ్రామం పౌరీ జిల్లాలో మారుమూల ఉంటుంది. ఫైన్ మొక్కలు అడవి నుంచి గ్రామంలోకి విస్తరించాయి. దీనివల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు తదితర వన్యప్రాణులు తమతో సహవాసం చేస్తుంటాయన్నారు.

మెట్రోపాలిటన్ సిటీల్లో పనికోసం వలసలు

ఈ గ్రామాల యువతులంతా ఏళ్ల తరబడి డెహ్రడూన్, హరిద్వార్, ఘజియాబాద్, నొడియా, ఫరీదాబాద్, ముంబై తదితర నగరాల్లోని కంపెనీల్లో పనికోసం బయలుదేరి వెళతారని బాలోరిలోని ఇద్దరు వ్యక్తుల తల్లి బాసంతిదేవి తెలిపింది. వారిలో ఒకరు గుర్గావ్‌లోని ఓ ఫ్యాక్టరీ క్యాంటిన్‌లో మరో వ్యక్తి త్వరలో వెళతాడని తెలిపారు. తమలో అత్యధికులు ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లలో పనిచేయానికి సిద్ధపడతామని బిపిన్ కుమార్ అనే కుర్రాడు చెప్పాడు.

తక్కువ వేతనాలకైనా పనిచేయాల్సిందే

ఈ కొండ ప్రాంతంలో గ్రామాల వాసులంతా అతి తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తుందని, లేకపోతే ఖాళీగా సొంతింటికి వెళ్లాల్సి వస్తుందని పాలౌరి జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఈ గ్రామాల వాసులకు ప్రభుత్వాలపై ఎల్లకాలం విశ్వాసం ఉండదని కూడా చెప్తున్నారు. ఒకసారి బీజేపీకి ఓటేస్తే, మరోసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తారని లలితా దేవి అనే 70 ఏళ్ల మహిళ వ్యాఖ్యానించారు. తమ తరం వారంతా తమ వారసులను పనికోసం పంపివేస్తామని పేర్కొన్నారు.

కలప ఇండ్లలోనే జీవనం

1980 నుంచి 100 కుటుంబాలు బాలోరి గ్రామంలో జీవిస్తున్నాయి. వారిలో అత్యధికులు కలప ఇండ్లలోనే జీవిస్తున్నారు. ఎల్లవేళలా రంగురంగుల తలుపులకు జెయింట్ లాక్స్ వేలాడుతుంటాయి. వీరిలో అత్యదికులు ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నిస్తుంటారు.

సమస్య పరిష్కారానికి సమయం కావాలి: కాంగ్రెస్

సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే కొంత సమయం అవసరమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మథురాదత్ జోషి తెలిపారు. వలసల నివారణకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదన్నారు. కొండ ప్రాంతాల్లో రైతులు సాగుచేసే పంటలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని, మారుమూల గ్రామాలకు వైద్యులను పంపుతున్నామని తెలిపారు. యువతకు శిక్షణ ఇచ్చేందుకు పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. అటవీరంగంలోనూ ఉపాధి కల్పనకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. వలసలను నిరోధించడమే తమ లక్ష్యమన్నారు.

ప్రణాళికల రూపకల్పనతోనే సరి

కొండ ప్రాంతాల్లో చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల స్థాపనకు పలు ప్రణాళికలు తమ పార్టీ ముందు ఉన్నాయని బీజేపీ ఎంపి మున్నా సింగ్ తెలిపారు. పర్యాటక రంగ అభివ్రుద్ది ద్వారా ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పన, ఇందుకోసం కొండల మధ్య వంతెనలు నిర్మించడానికి, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం, యాపిల్స్, అల్లం పంటలకు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. గతంలోనూ ఇటువంటి హామీలు ఇచ్చి వెళ్లారని, కానీ మార్పులేదని స్థానికులు చెప్పారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ జీవితాల్లో ఎటువంటి మార్పు లేదని బౌండుల్ గ్రామంలోని నవీన్ జుయల్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అప్పుడప్పుడు తమ కుటుంబాలకు మద్దతు లభిస్తున్నదన్నారు.

English summary
On the morning of 15 February, a group of six will leave Boundul village on a long trek along a narrow path to cast their vote in Uttarakhand’s assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X