వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ జల విషాదం: 32కు చేరిన మృతుల సంఖ్య, మరో 197 మందికి కొనసాగుతున్న రెస్క్యూ

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఛమోలి జిల్లాలోని ధౌలిగంగా, అలకనంద నదుల వరదల్లో చిక్కుకున్నవారి కోసం మంగళవారం రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి సహాయక బృందాలు. ఆదివారం సంభవించిన ఈ జల విలయంలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 32 మందిని వెలికితీశారు.

ఇప్పటికీ కానరాని 197 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. భారీ వరదల కారణంగా 480 వాట్ల ఎన్టీపీసీ తపోవన్-విష్ణుగడ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. 13.2 మెగావాట్ల రిషిగంగా హైడల్ ప్రాజెక్టు కూడా ఈ వరదలతో భారీగా దెబ్బతింది. నదీ పరివాహక గ్రామాల్లోని పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.

 Uttarakhand floods: 32 dead, 197 still missing as boulders hamper rescue efforts in Tapovan tunnel

సుమారు 600 మందికిపైగా భారత సైనికులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఛమోలి జిల్లాలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదల కారణంగా దెబ్బతిన్న పలు గ్రామాల ప్రజలకు ఐటీబీపీ నిత్యావసర సరుకులను అందించడం పట్ల ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

5-6 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఐటీబీపీ జవాన్లు నడిచివెళ్లి వరద బాధిత ప్రజలకు నిత్యావసర వస్తువులు, మందులు, ఇతర వస్తువులను అందజేయడాన్ని తాను స్వయంగా చూసినట్లు సీఎం రావత్ తెలిపారు.

కాగా, 2.5 కిలోమీటర్ల మేర పొడవున్న టన్నెల్‌లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 35 మంది వరకు ఆ టన్నెల్‌లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఆదివారం నుంచి మంగళవారం రాత్రి వరకు కూడా నిరంతరాయంగా సహాయక బృందాలు చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు శ్రమిస్తున్నాయి.

సహాయక చర్యలపై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు. టన్నెల్‌లో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని చెప్పారు.
కొండచరియలు, హిమానీనదాలు విరిగిపడటంతోనే ఒక్కసారిగా నదులు పొంగిపొర్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

English summary
Rescue operations are still underway in Uttarakhand's Chamoli district where flash floods in the Alaknanda river system caused widespread destruction on Sunday. A total of 32 bodies have been recovered while authorities put the official figure of missing persons at 197.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X