వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగులబడుతోన్న దేవభూమి: అరుదైన వృక్షాలు బుగ్గిపాలు: వన్యప్రాణుల సజీవదహనం: 4 రోజులైనా

|
Google Oneindia TeluguNews

డెహ్రాడున్: దేవభూమిగా భావించే ఉత్తరాఖండ్ మంటల బారిన పడింది. ఉత్తరాఖండ్ అడవుల్లో నాలుగు రోజుల కిందట చెలరేగిన మంటలు దహించి వేస్తున్నాయి. వేలాది అరుదైన వృక్షాలు, ఔషధ మొక్కలు బుగ్గిపాలు అవుతున్నాయి. వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో పడింది. వందల సంఖ్య వన్యప్రాణులు మంటలకు అహూతి అవుతున్నాయి. మంటల బారి నుంచి తప్పించుకోవడానికి జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి.

Recommended Video

Uttarakhand Forest Tragedy || ఉత్తరాఖండ్ కార్చిచ్చు దారుణం, హృదయ విదారకం....!!

తమ పౌరులను స్వదేశానికి తీసుకువెళ్లాలని చైనా సంచలన నిర్ణయం ..ఉద్రిక్తతల నేపధ్యమేనా ?తమ పౌరులను స్వదేశానికి తీసుకువెళ్లాలని చైనా సంచలన నిర్ణయం ..ఉద్రిక్తతల నేపధ్యమేనా ?

ఎండ తీవ్రత వల్లే మంటలు ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. రాజధాని డెహ్రాడూన్ సహా నాలుగు ఆరు జిల్లాల్లో కార్చిచ్చు అంటుకుంది. డెహ్రాడూన్, నైనిటాల్, పౌరి, చమోలి, పితోర్‌గఢ్, అల్మోరా, బాగేశ్వర్ జిల్లాల్లో కార్చిచ్చు తీవ్రత అధికంగా ఉంటోంది. ఆయా జిల్లాల్లో 51.34 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం మంటల బారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. మంటల తీవత్ర మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదని అనుమానిస్తున్నారు.

 Uttarakhand Forest Fire: Over 50 Hectare Land Gutted For the past four days

హిమాలయ పర్వత పంక్తులను ఆనుకుని ఉండే అడవులు కావడం వల్ల అరుదైన జాతికి చెందిన వృక్షాలు, ఔషధ మొక్కలకు ఆలవాలం ఉత్తరాఖండ్. నాలుగు రోజులుగా చెలరేగుతున్న మంటల వల్ల చాలామటుకు అహూతి అయినట్లు అధికారులు చెబుతున్నారు. పక్షులు, వన్యప్రాణులు సజీవ దహనం అవుతున్నాయి. వరుసగా నాలుగోరోజు కూడా మంటలను నియంత్రించడంలో విఫలమైంది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా కొత్త ప్రాంతాలకు అగ్నికీలలు వ్యాప్తి చెందుతున్నాయి.

 Uttarakhand Forest Fire: Over 50 Hectare Land Gutted For the past four days

అటవీ సాంధ్రత అధికంగా ఉండే ఉత్తరాఖండ్‌లో కార్చిర్చు వ్యాప్తి చెందే సంఘటనలు కొత్తేమీ కాదు. ప్రతి సంవత్సరం వేసవిలో అడవులు అంటుకుంటూనే ఉంటాయి. వాటి తీవ్రత పెద్దగా ఉండదు. ఈ సారి మాత్రం నాలుగు రోజులుగా అడవులు మండుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. మంటలను నియంత్రించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించట్లేదని విమర్శిస్తున్నారు.

English summary
Uttarakhand has been reeling under the effects of another tragedy. For the past four days, the state has been burning up as wildfires break out in different regions of the Uttarakhand. So far since the beginning of the year the state has had to deal with 46 wildfires which have affected over 51.34 hectares of forest lan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X