వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: జలవిలయంలో 203 మంది గల్లంతు -18 మృతదేహాలే దొరికాయి: సీఎం కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ లో పెనువిషాదం నింపిన జలవిలయంలో మృతులు, గల్లంతైనవారి సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఘటన జరిగిన తొలి గంటలో 50 మంది గల్లంతైనట్లు భావించినా, నిన్న సాయంత్రానికే ఆ సంఖ్య 170కు పెరిగింది. సోమవారం మధ్యాహ్నం నాటికి అన్ని మార్గాల్లో డేటాను సేకరించిన యంత్రాంగం.. వరదల్లో గల్లంతైనవారి సంఖ్యను 203గా పేర్కొంది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ మేరకు కొద్దిసేపటి కిందట కీలక ప్రకటన చేశారు..

Recommended Video

Rescue workers reached Reni village in Chamoli district of Uttarakhand | Oneindia Telugu

చెన్నైఎయిర్ పోర్టు వద్ద కిడ్నాప్ -మహారాష్ట్ర అడవుల్లో సజీవదహనం -జార్ఖండ్ నేవీ ఉద్యోగి దారుణహత్యచెన్నైఎయిర్ పోర్టు వద్ద కిడ్నాప్ -మహారాష్ట్ర అడవుల్లో సజీవదహనం -జార్ఖండ్ నేవీ ఉద్యోగి దారుణహత్య

అసలేమైందంటే..

అసలేమైందంటే..


ఉత్తరాఖండ్, చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి పర్వతం(హిమానినదం) నుంచి ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. పెద్దపెద్ద మంచు ముక్కలు, రాళ్లు, బురదతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో తపోవన్‌-రేణిలో ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్‌-విష్ణుగఢ్‌ ప్రాజెక్టు కూడా దెబ్బతినింది. ఆ ప్రాజెక్టుల వద్ద పనిచేస్తోన్న వందలాది కార్మికులు వరదలాంటి బురదలో గల్లంతయ్యారు. అయితే..

సచిన్ 'భారతరత్న'కు అనర్హుడు -కొడుకు ఐపీఎల్ ఎంట్రీ కోసమే -కాంగ్రెస్ సంచలనం -పవార్ కూడాసచిన్ 'భారతరత్న'కు అనర్హుడు -కొడుకు ఐపీఎల్ ఎంట్రీ కోసమే -కాంగ్రెస్ సంచలనం -పవార్ కూడా

గంటగంటకూ పెరుగుతోంది..

గంటగంటకూ పెరుగుతోంది..

జలప్రళయం సమయంలో తపోవన్‌ పవర్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద 22 మంది కలిపి మొత్తం 170 మంది కనిపించకుండా పోయినట్లు ఐటీబీపీ అధికారులు ఆదివారం ప్రకటించారు. కానీ సోమవారం నాటికి బాదితుల సంఖ్య పెరిగింది. తపోవన్ ప్రాజెక్టుకు అనుబంధంగా మరో చోట పనులు చేస్తున్న వారు కూడా వరదల్లో కొట్టుకుపోయారు. ఇప్పటిదాకా.. ప్రాజెక్టు సొరంగ మార్గంలో చిక్కుకున్న16 మంది తప్ప మిగతా వాళ్లెవరూ ప్రాణాలతో కనిపించలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 18 మృతదేహాలను వెలికి తీశారు. దీనిపై..

203 మంది జాడలేదు..

203 మంది జాడలేదు..


హిమానీనదం ఉత్పాతం కారణంగా ధౌలిగంగా నదిలో ఏర్పడిన వరదల్లో ఇప్పటివరకు 203 మంది గల్లంతయ్యారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. రేణీ గ్రామం వద్ద రుషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు. రేణీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే తపోవన్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, అక్కడే అనుబంధంగా మరో సంస్థ కూడా ఉందన్నారు. ఆ సంస్థలో పాతికమంది వరకు పనిచేస్తున్నట్టు సమాచారం ఉందని, అయితే, వారందరి ఆచూకీ తెలియరాలేదని సీఎం పేర్కొన్నారు.

English summary
Over 200 people are feared missing following the glacier burst, which led to heavy flooding in Dhauliganga and Alaknanda rivers, said Uttarakhand Chief Minister Trivendra Singh Rawat on Monday while adding that rescue operation is underway. "Around 203 people are missing including 11 dead bodies are recovered as of now. We are estimating that 35 people are stuck in another tunnel. Rescue operation is underway," said Rawat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X