వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 తుపాకులు చేతుల్లో.. క్రేజీ డ్యాన్స్.. పోలీసుల వేట షురూ..!

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్‌ : రెండు తుపాకులు చేతుల్లో పట్టుకుని వీర లెవెల్లో డ్యాన్స్ చేస్తూ వీడియోకు ఫోజులిచ్చిన ఓ వ్యక్తి కోసం ఉత్తరాఖండ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి ఎక్కడుంటారో తెలియక పరేషాన్ అవుతున్నారు పోలీసులు. ఓ హిందీ పాటకు జబర్ధస్త్ డ్యాన్స్ చేయడం ఓకే.. కానీ ఆయన చేతుల్లో తుపాకులు దర్శనమివ్వడమే పోలీసుల ఆగ్రహానికి కారణమైంది.

తుపాకులు చేతబట్టి డ్యాన్స్ చేయడం నేరమంటున్నారు సర్కిల్ ఆఫీసర్ అభయ్ సింగ్. అయితే ఈ వీడియోలో ఉన్నది ఎవరు.. అసలు ఈ వీడియో ఏ ప్రాంతంలో తీసిందనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు పోలీసులు. అయితే ఆ వీడియోలో ఉన్న సదరు వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు సదరు సర్కిల్ ఆఫీసర్.

Uttarakhand Man dances with 2 guns in his hand viral video

జులై రెండో వారంలో ఇలాగే ఉత్తరాఖండ్‌ హరిద్వార్-ఖాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ తప్పతాగి చిందులేశారు. పలు వివాదాలు చుట్టుముట్టి పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అదే క్రమంలో మరో వివాదంలో ఇరుక్కున్నారు. డెహ్రాడూన్‌లోని ఓ లాడ్జి గదిలో తన అనుచరులతో కలిసి మద్యం సేవించి చిందేశారు.

ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు తుపాకులను చేతిలో పట్టుకుని నానా విన్యాసాలు చేస్తూ హంగామా చేశారు. అసభ్య పదజాలం వాడుతూ బాలీవుడ్ సాంగ్‌కు చిందులేస్తూ హల్‌చల్ చేశారు. అయితే కాలికి సర్జరీ చేయించుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా వేడుకలు చేసుకునే క్రమంలో వీడియో తీసినట్లు తెలుస్తోంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు ఎమ్మెల్యేను నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు.

English summary
In a recent viral video, a man was seen dancing while carrying 2 guns in his hand in Uttarakhand's Haridwar. Haridwar's Circle officer (CO) Abhay Singh said "We'll get the video verified and get the facts checked. We'll further take statutory proceedings." However, police has started their investigation in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X