వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ..మ..మంత్రి గారి మాట: ఆవు ఆక్సిజన్ తీసుకుని అదే ఆక్సిజన్ విడుదల చేస్తుందట

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో ఈ జీవి అయినా ఆక్సిజన్ తీసుకునే బతుకుతుంది. ఒక్క మొక్కలు వృక్షాలు తప్ప. కానీ ఆవు ఆక్సిజన్ తీసుకోవడంతో పాటు తీసుకున్న ఆక్సిజన్‌నే మళ్లీ బయటకు విడుదల చేస్తుందట. ఇది మేము చెబుతున్న థియరీ కాదు.. ఉత్తరాఖండ్ పశుసంవర్ధక శాఖ మంత్రి రేఖ ఆర్య చెబుతున్నమాటలు. ఇందుకు ఆమె ఓ లెక్క కూడా వల్లెవేసింది. అదేంటో చూద్దాం....

ఉత్తరాఖండ్ పశుసంవర్ధక శాఖ మంత్రి రేఖా ఆర్య ఆవుపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆవు ఆక్సిజన్ తీసుకోవడమే కాదు... బయటకు విడుదల చేసేది కూడా ఆక్సిజనే అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఎక్కడో చెప్పింది కాదు... సాక్షాత్తు ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్న మాటలివి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో రేఖా ఆర్య పై వ్యాఖ్యలు చేశారు.

Uttarakhand minister says that cow inhales as well as exhales oxygen

ఐన్‌స్టీన్‌నే తప్పుబట్టిన స్వామి నిత్యానంద..త్వరలో కోతులు మాట్లాడతాయటఐన్‌స్టీన్‌నే తప్పుబట్టిన స్వామి నిత్యానంద..త్వరలో కోతులు మాట్లాడతాయట

రేఖా ఆర్య మాటలను కొట్టిపారేశారు జంతుశాస్త్ర నిపుణులు. భూమిపై ఏ జీవి కూడా ఆక్సిజన్‌ను విడుదల చేయదన్నారు. ఒక్క మొక్కలు, వృక్షాలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని వివరించారు. కిరణజన్య ప్రక్రియ సమయంలో మాత్రమే మొక్కలు ఆక్సిజన్‌ను వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తాయని స్పష్టం చేశారు. మంత్రిగారి మాటలు ఆసక్తికరంగా ఉండటంతో కొందరు జర్నలిస్టులు రేఖ ఆర్యను తను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎలా కరెక్టవుతుందో చెప్పాలని అడిగారు. అందుకు మేడంగారు సమాధానం ఇలా ఇచ్చారు.

"ఆవు ఆక్సిజన్ తీసుకోవడమే కాదు.. ఆక్సిజన్‌ను విడుదల కూడా చేస్తుంది. ఆవు నుంచి స్వచ్ఛమైన పాలు వస్తాయి, నెయ్యి తయారవుతుంది. దీంతో ఆవులో ఎలాంటి చెడు ప్రక్రియ కానీ చెడు శక్తికానీ ఉండదు. ఈ లెక్క ప్రకారము కచ్చితంగా చెప్పగలను ఆవు ఆక్సిజన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది "అని సమాధానంగా చెప్పారు రేఖ ఆర్య.

మంత్రిగారి సమాధానంతో తృప్తి చెందని జర్నలిస్టులు ఢిల్లీలోని జువాలజీ ప్రొఫెసర్‌ను కలిసి వివరణ అడిగారు. దీంతో ఆయన జంతువులకు సంబంధించిన శ్వాసకోశ వ్యవస్థ గురించి వివరించారు. మనుషులు 21శాతం ఆక్సిజన్‌ను లోపలికి పీల్చుకుంటే అందులో మన శరీరం 4నుంచి 5శాతం మాత్రమే వినియోగించుకుంటుందన్నారు. మిగతాది బయటకు విడుదల అవుతుందని చెప్పారు. బయటకు కార్బన్ డైయాక్సైడ్‌తో పాటు ఇతర వాయువులను విడుదల చేస్తామని వెల్లడించారు. ఇదే పద్ధతి అన్ని జీవరాశులకు వర్తిస్తుందని చెప్పిన ఆయన ఆవుకు కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

Recommended Video

2017 కంటే కూడా ఈ ఏడాది వర్షాలు బాగా కురవనున్నాయి: ఐఎండీ

English summary
A baffling claim has been made by none other than Uttarakhand Animal Husbandry Minister Rekha Arya, who said the cow is the "only animal that not only inhales oxygen, but also exhales it". Her remarks came on the floor of the Uttarakhand Assembly on Wednesday when a resolution was passed, seeking the status of "rashtra mata" (mother of the nation) for the cow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X