• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తరాఖండ్: కాంగ్రెస్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులకు తిరుగుబాటు బెడద

By Swetha Basvababu
|

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిజెపి పరస్పరం పోటీ పడుతున్నాయి. కానీ ఆ పార్టీలకు చెందిన రాష్ట్ర శాఖల అధ్యక్షులు మాత్రం పరస్పరం తమ సొంత పార్టీలోనే తిరుగుబాటు అభ్యర్థులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ కిశోర్ ఉపాధ్యాయకు ప్రత్యర్థిగా అదే పార్టీ నాయకుడు ఆర్యేంద్ర శర్మ నిలిస్తే.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ తన పార్టీ సహచరుడు డాక్టర్ ప్రమోద్ నైన్ వాల్ నుంచి గట్టి పోటీనెదుర్కొంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కుమోన్ కొండల పరిధిలో పలు మారుమూల పల్లెల మధ్య.. నిత్యం మంచు కురిసే ప్రాంతాల మధ్య గర్హ్ వాల్ ప్రాంతమది. సహస్పూర్ నియోజకవర్గం నుంచి ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

దీంతో తనకు దక్కని సీటులో కిశోర్ ఉపాధ్యాయ గెలువురాదన్న పంతంతో ఆయన పార్టీ సహచరుడు ఆర్యేంద్ర శర్మ తిరుగుబాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. శనివారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో భారీస్థాయిలో ప్రజలు తరలి రావడం పీసీసీ చీఫ్ కిశోర్ ఉపాధ్యాయ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో ఉపాధ్యాయ వర్గం ఆర్యేంద్ర శర్మను ఉపసంహరింపజేసేందుకు విశ్వ ప్రయత్నాలుచేసినా కానీ ప్రయోజనం లేకపోయింది.

చివరి క్షణంలో నిరాకరణపై ఆర్యేంద్ర ఆగ్రహం

చివరి క్షణంలో నిరాకరణపై ఆర్యేంద్ర ఆగ్రహం

2012లో ఓటమి పాలైన ఆర్యేంద్ర శర్మ స్థానాన్ని ఉపాధ్యాయ దక్కించుకోవడం ఆయనకు కోపం తెప్పించింది. ఎనిమిదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు చివరి క్షణంలో టిక్కెట్ నిరాకరించడం అన్యాయమని ఆర్యేంద్ర శర్మ ఆరోపిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటల వల్లే ఉపాధ్యాయకు టిక్కెట్ దక్కిందన్న అభిప్రాయం ఉంది. తొలుత సతీశ్ ఉపాధ్యాయ టెహ్రీ స్థానాన్ని కోరుకున్నారు. 2002, 2007 ఎన్నికల్లో ఈ స్థానం నుంచే ఉపాధ్యాయ గెలిచారు. 2012 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దినేశ్ ధనాయి చేతిలో కేవలం 377 ఓట్లతో ఓటమి పాలైన ఉపాధ్యాయ.. టెహ్రీ నుంచి పోటీ చేయాలని భావించినా.. సీఎం హరీశ్ రావత్ కాంగ్రెస్ పార్టీలోకి ధనాయి చేరికకు ఉపాధ్యాయ నిరాకరించారు.

ధనాయికి క్యాబినెట్.. ఖిన్నుడైన ఉపాధ్యాయ

ధనాయికి క్యాబినెట్.. ఖిన్నుడైన ఉపాధ్యాయ

దీంతో హరీశ్ రావత్.. ధనాయికి ఆరు శాఖలతో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఖిన్నుడైన ఉపాధ్యాయ.. సీఎం ఆదేశాల మేరకు తప్పుకునేందుకు నిరాకరించడంతో టెహ్రీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేంద్ర రామోలా అనే బలహీన అభ్యర్థిని చివరిక్షణాల్లో ఖరారు చేశారు. దీంతో ఉపాధ్యాయ.. సహాస్పూర్ స్థానానికి బదిలీ కావాల్సి వచ్చిందని చెప్తున్నారు. కానీ అధికారిక అభ్యర్థిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ ఎమ్మెల్యే ప్రీతంసింగ్ పన్వర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రి చెప్పారు. తద్వారా గతేడాది ప్రారంభంలో రావత్ ప్రభుత్వ మనుగడ సాగించేందుకు సహకరించిన ఇతర పార్టీలకు కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం అందిస్తామన్న సంకేతాలిచ్చింది. అందుకోసం పీసీసీ చీఫ్ ఉపాధ్యాయ అభ్యర్థనలను తోసిపుచ్చింది. కానీ ఆర్యేంద్ర శర్మకు పార్టీలోని కొందరు నేతలు మద్దతు పలుకడం ఉపాధ్యాయకు ఆందోళన కలిగిస్తున్నది.

 రాణిఖేట్ నుంచి బిజెపి రాష్ట్ర చీఫ్

రాణిఖేట్ నుంచి బిజెపి రాష్ట్ర చీఫ్

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అజయ్ భట్ బరిలో నిలిచారు. కానీ దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న అజయ్ మహారాను ఎదుర్కోవడంతోపాటు అజయ్ భట్.. తన పార్టీ నేత డాక్టర్ ప్రమోద్ నైన్‌వాల్‌ను తిరుగుబాటు అభ్యర్థిగా ఎదుర్కోవాల్సి వస్తున్నది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ప్రమోద్ ఎన్నికల ప్రచార ర్యాలీలకు వందల మంది బిజెపి కార్యకర్తలు హాజరు కావడం అజయ్ భట్ కు ఆందోళన కలిగిస్తోంది. రాణిఖేట్ నియోజకవర్గం పరిధిలోని కొన్ని గ్రామాలకు వెళ్లి రావాలంటే ఒక రోజంతా సరిపోతుంది.

మహారాతో పోటీ భట్‌కు సవాలే

మహారాతో పోటీ భట్‌కు సవాలే

కాంగ్రెస్ ప్రముఖుడు మహారాతో తలపడటం అజయ్ భట్‌కు పెద్ద సవాల్. 2007 ఎన్నికల్లో మహారా గెలుచుకున్న స్థానాన్ని అజయ్ బట్ 2012 ఎన్నికల్లో కేవల 78 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకున్నారు. కానీ ప్రస్తుతం తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రమోద్ నైన్ వాల్ కు పార్టీలోనూ, ప్రజల్లోనూ పేరుండటం అజయ్ భట్ కు ఆందోళన మిగులుస్తున్నది. ఇప్పటికి రూ.600 అద్దె ఇంటిలో నివసిస్తున్న తన క్లీన్ ఇమేజ్, అవినీతి మయమైన కాంగ్రెస్ పార్టీపై విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు.

అజయ్ భట్ బ్రాహ్మణ సామాజిక వర్గ నేత.. హరీశ్ రాజ్ పుత్రుడు

అజయ్ భట్ బ్రాహ్మణ సామాజిక వర్గ నేత.. హరీశ్ రాజ్ పుత్రుడు

మరో గమ్మత్తేమిటంటే అజయ్ భట్, సీఎం హరీశ్ రావత్ ఇరుగు పొరుగు గ్రామాల వాసులే. అజయ్ భట్ బ్రాహ్మణ నేత అయితే హరీశ్ రావత్ రాజపుత్ర సామాజిక వర్గ నాయకుడు. కుమాన్ జోన్.. హరీశ్ రావత్ కు బలమైన పట్టు ఉన్న ప్రాంతమైనా మూడు విజయాలు సాధించిన తనకు విజయం సాధ్యమేనని చెప్తున్నారు అజయ్ భట్. ఇప్పటికి ఐదుసార్లు పోటీచేసి మూడు విజయాలు నమోదుచేసిన అజయ్ భట్.. బీజేపీ మాత్రు సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో పనిచేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Against PCC chief Kishore Upadhyaya is Congress rebel Aryendra Sharma, while on the other side, state BJP chief Ajay Bhatt faces BJP rebel Dr Pramod Nainwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more