వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీపున సీనియర్లు: పోలీసుల ఉప్పాట (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ లో పోలీసులకు పోలీసు బాస్ లు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసు వీపు మీద కుర్చుని ఫిట్ నెస్ పరిక్షలు నిర్వహిస్తున్నారు. వీటిని చూసి కొందరు నవ్వుకుంటుంటే కొందరు పోలీసులు మాత్రం దేవుడా ఏంటీ మాకు ఈ కష్టాలు అంటూ ఆందోళన చెందుతున్నారు.

పోలీసు డిపార్ట్ మెంట్ లో శారీరక దారుడ్య పరిక్షలు (ఫిట్ నెస్ పరిక్షలు) నిర్వహించేందుకు పోలీసులను ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ పోలీస్ గ్రౌండ్స్ కు పిలిపించారు. తరువాత వారిని వరుసగా నిలబెట్టి బరువులు తూచే వేయింగ్ మిషన్ ఎక్కించారు.

 Uttarakhand police constable made to carry senior on his back

అనంతరం గ్రౌండ్ లో ఓ సర్కిల్ చుట్టూ రౌండ్లు కొట్టించారు. పోలీసులు రౌండ్లు కొట్టే సమయంలో ఓ పోలీసు అధికారిని వీపు మీద ఎత్తుకుని ఉప్పు బస్తా ఆట ఆడుతున్నట్లు రౌండ్లు కొట్టాలి. ఆ సమయంలో కొందరు పోలీసులు పై అధికారుల మీద చిరాకు ప్రదర్శించలేక నానా ఇబ్బంది పడ్డారు.

పైకి చిరునవ్వుతోనే భారీ బరువు ఉన్న అధికారులను వీపున ఎత్తుకుని గ్రౌండ్ లో రౌండ్లు కొడుతూ నానా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఆ దృశ్యాలను వీడియోలు తీసి టీవీలలో ప్రసారం చేశాయి.

English summary
One overweight constable was then ordered to take a round of the ground with a SHO on his back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X