వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ పోలీస్.. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి సేఫ్..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ : తమ కళ్లేదుట ఎన్నో సంఘటనలు జరుగుతున్నా మనకెందుకులే అని చూస్తూ వెళ్లిపోతున్న రోజులివి. ఆ క్రమంలో ఓ పోలీస్ చూపిన ధైర్యం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. విధినిర్వహణలో ఉన్న సదరు పోలీస్ గంగానదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని క్షేమంగా బతికి బయటపడేటట్లు చేశారు.

కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!

హర్యానాకు చెందిన విశాల్.. పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా హరిద్వార్‌కు చేరుకున్నారు. అక్కడ సమీపంలోని గంగానదిలోకి దిగి పవిత్ర స్నానం ఆచరించే క్రమంలో అదుపుతప్పాడు. ఆయనకు ఈత రాని కారణంగా అలా నదిలో కొట్టుకుపోతున్నాడు. అది గమనించిన ఓ పోలీస్ అతడిని కాపాడేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. అయినా కూడా అతడు బెదరలేదు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.

Uttarakhand Police Jumps Into The Ganga river And Saves A Man

విశాల్ నదిలో కొట్టుకుపోతుండటంతో సదరు పోలీస్ ఏమీ ఆలోచించలేదు. వెంటనే లైఫ్ జాకెట్ ధరించి నదిలోకి దూకారు. అతడి దగ్గరకు చేరుకుని క్రమంగా ఒడ్డుకు చేర్చాడు. అలా పోలీస్ ధైర్యసాహసాలతో విశాల్ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శభాష్ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడి ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

English summary
Though a lot of us doubt the capabilities and the working of local police, one cannot ignore the fact that in a lot of cases these men put their lives in danger to protect others. Here is one example of how an Uttarakhand Police personnel put his own life in danger to protect that of a citizen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X