• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెబెల్స్ గెలిస్తే ఉత్తరాఖండ్ నష్టపోయేది: హరీశ్ రావత్

|

డెహడ్రూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు శుభారంభం అవుతుందని ఆ రాష్ట్ర సీఎం హరీశ్ రావత్ పేర్కొన్నారు.

మీ నాన్న మొండిఘటం: మనవరాలితో ములాయం, నవ్వేసిన అఖిలేష్

2002లో జరిగిన ఎన్నికల్లో తొలుత ఉత్తరాఖండ్‌లో విజయం సాధించిన తర్వాతే 2004 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణకు కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి విజయం సాధించాల్సిన అవసరం ఉన్నదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ దఫా కూడా అదే ప్రాతిపదిక కావాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రగతి మా నినాదం..

ప్రగతి మా నినాదం..

రాష్ట్రాన్ని అభివ్రుద్ధి పథంలో తీసుకెళ్లడమే తమ ప్రచారాస్త్రం అని, సాతత్ వికాస్ కా సంకల్ప్ (సుస్థిరత అభివ్రుద్దే లక్ష్యం) అని చెప్పారు. గతేడాది ప్రజాస్వామ్యాన్ని హత్యచేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూడా తాము పోరాడతామని తెలిపారు. ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ నినాదమే అభివ్రుద్ధి అని చెప్పారు.

రాష్ట్ర ప్రజలంతా మా వెంటే..

రాష్ట్ర ప్రజలంతా మా వెంటే..

తమ పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తున్నారని హరీశ్ రావత్ చెప్పారు. తనపై తన రాష్ట్ర ప్రజలపై తనకు విశ్వాసం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలంతా తన పక్షమేనని వ్యాఖ్యానించారు. బిజెపికి మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాష్ట్రంలో పలు సభలు నిర్వహించగా, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సారథ్యంలో ఒక్క సభ మాత్రమే జరిగినా ప్రజలపై తనకు నమ్మకం ఉన్నదని ఆయన పేర్కొనడం ఆసక్తికర పరిణామం. ఉత్తరాఖండ్ ప్రజలు తన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలని భావిస్తే మరో ఐదేళ్లు అధికారాన్ని కట్టబెడతారని విశ్వాసం వ్యక్తంచేశారు.

భిన్నమైన పరిస్థితుల్లో బాధ్యతల నిర్వహణ

భిన్నమైన పరిస్థితుల్లో బాధ్యతల నిర్వహణ

గత ఏడాది పది మంది పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ గుర్తుచేశారు. 2013 వరదల వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకోవడంతోపాటు గత ఏడాది రాజకీయ సంక్షోభం వరకు తాను విభిన్నమైన సంక్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పారు.

రెబెల్స్ గెలిస్తే ఉత్తరాఖండ్‌కే నష్టం జరిగేది

రెబెల్స్ గెలిస్తే ఉత్తరాఖండ్‌కే నష్టం జరిగేది

తనకు ఎవరిమీదా అసూయ, పగ లేదని హరీశ్ రావత్ అన్నారు. కానీ ఒకవేళ పది మంది తిరుగుబాటు దారులు గెలుపొందితే మాత్రం ఉత్తరాఖండ్ నష్టపోయేదని, వారి విజయం వచ్చే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి పునాదిగా ఉండేదని చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ పార్టీ నాయకత్వం పనితీరు నచ్చక మరో పార్టీలో చేరి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కారణమన్యాయరన్నారు. ఒకవేళ వారు గెలిస్తే, అటువంటి రాజకీయ నాయకులను ప్రజలను ఆమోదిస్తారన్న అభిప్రాయం కలిగేదని తెలిపారు. ఒకవేళ వారు ఓటమి పాలైతే ఉత్తరాఖండ్ గెలిచేదన్నారు. కనుక వారు తప్పక ఓటమి పాలు కావాల్సిందేనన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలు ఈ పరిస్థితులను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానన్నారు.

మా లక్ష్యం ఉత్తమ ఉత్తరాఖండ్ నిర్మాణమే

మా లక్ష్యం ఉత్తమ ఉత్తరాఖండ్ నిర్మాణమే

తమ పోరాటమంతా ఉత్తమ ఉత్తరాఖండ్ నిర్మాణం కోసమేనని హరీశ్ రావత్ స్పష్టంచేశారు. బిజెపి మాదిరిగా కాంగ్రెస్ వ్యక్తిగత వ్యతిరేక రాజకీయాలకు పాల్పడబోదన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్న బిజెపిలో చేరిన తిరుగుబాటు దారులే చట్ట విరుద్ద ఇసుక మైనింగ్, అవినీతి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. 2014 ఫిబ్రవరిలో సీఎంగా ప్రమాణంచేసినప్పటి నుంచి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్నామన్నారు. 2013 విపత్తు నుంచి బయట పడేందుకు చాలా కష్ట పడాల్సి వచ్చిందన్నారు. తన రెండేళ్ల పదవి కాలంలో ప్రజలు బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నారని, సరిగ్గానే కోలుకోగలిగామన్నారు. 2013 జూన్ లో కురిసిన వర్షాలతో భూ చరియలు విరిగి పడటంతోపాటు వరదలు ముంచెత్తాయి. ఫలితంగా పర్యాటకులు, భక్తులు సహా 5000 మంది మరణించారు.

కేంద్రం వివక్షకు వ్యతిరేకంగానే

కేంద్రం వివక్షకు వ్యతిరేకంగానే

తాను హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిన అంశంపై తప్పుడు అభిప్రాయాలను ప్రచారంలో పెట్టారని హరీశ్ రావత్ చెప్పారు. తన నిరసన కేవలం కేంద్రం వివక్షాపూరిత వైఖరికి మాత్రమే వ్యతిరేకమన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అభివ్రుద్ధి కార్యక్రమాలకు అనుమతి కోసం జోనల్ మాస్టర్ ప్లాన్ (జడ్ఎంపి) సమర్పించామన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని భాగిరథీ లోయలో పలు పనులు చేపట్టేందుకు అనుమతించిన కేంద్రం.. తాము ప్రతిపాదించిన జడ్ఎంపిని మాత్రం తిరస్కరించిందని ఆయన గుర్తుచేశారు. తమ రాష్ట్రంలో అభివ్రుద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు జడ్ఎంపికి అనుమతించాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Uttarakhand will lose if rebels win, says Harish Rawat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more