• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎమ్మెల్యే హల్‌చల్.. మందేసి, చిందేసి.. గన్స్‌తో ఎంజాయ్ (వీడియో)

|

డెహ్రాడూన్‌ : ప్రజాప్రతినిధిగా బాధ్యతతో మెలగాల్సిన ఓ ఎమ్మెల్యే మందేసి చిందేశాడు. అంతేకాదు తుపాకులు చేతబట్టి డ్యాన్స్ చేస్తూ హంగామా చేశాడు. అనుచరులతో కలిసి స్టెప్పులేస్తూ హీరోలా ఫీలయ్యాడు. కానీ చివరకు సీన్ రివర్సయింది. ఆ తతంగమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రిమార్క్ పడింది. అయితే ఆ ఎమ్మెల్యేకు ఇదేమీ కొత్త కాదు. ఇదివరకు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. బీజేపీకి చెందిన సదరు ఎమ్మెల్యే ఇప్పటికే మూడుసార్లు హైకమాండ్ ఆగ్రహానికి గురై పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు.

బీజేపీ ఎమ్మెల్యే తుపాకులతో హంగామా..!

ఉత్తరాఖండ్‌ హరిద్వార్-ఖాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ నిర్వాకం మరోసారి వివాదస్పదమైంది. ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టి పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. డెహ్రాడూన్‌లోని ఓ లాడ్జి గదిలో తన అనుచరులతో కలిసి మద్యం సేవించి చిందేశాడు.

ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు తుపాకులను చేతిలో పట్టుకుని నానా విన్యాసాలు చేస్తూ హంగామా చేశాడు. అసభ్య పదజాలం వాడుతూ బాలీవుడ్ సాంగ్‌కు చిందులేస్తూ హల్‌చల్ చేశారు. అయితే ఈమధ్యే కాలికి సర్జరీ చేయించుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా వేడుకలు చేసుకునే క్రమంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మరోసారి వార్తల్లోకెక్కారు.

 ఇప్పటికే మూడుసార్లు పార్టీ నుంచి ఔట్.. ఈసారి ఏమవునో..!

ఇప్పటికే మూడుసార్లు పార్టీ నుంచి ఔట్.. ఈసారి ఏమవునో..!

ప్రజాప్రతినిధిగా బాధ్యతతో మెలగాల్సిన ప్రణవ్ సింగ్‌కు ఇలాంటివేమీ కొత్త కాదు. ఇదివరకు ఎన్నో వివాదాల్లో కేంద్ర బిందువుగా మారారు. ఆ మేరకు మూడుసార్లు పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. అదలావుంటే కొద్ది నెలల కిందట ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ ప్రణవ్ సింగ్ బెదిరించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. అప్పుడు కూడా పార్టీ హైకమాండ్ మొట్టికాయలు వేసింది.

అయితే మందేసి చిందేస్తూ తుపాకులు చేతబట్టి నానా రచ్చ చేసిన ఈ ఎమ్మెల్యే వ్యవహారం వెలుగుచూడటంతో మరోసారి పార్టీ పెద్దలు తలంటినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్‌కు గురైన ప్రణవ్ సింగ్‌పై మరోసారి చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

హరీష్ రావు దూసుకెళుతున్నారుగా.. అప్పుడలా, ఇప్పుడిలా..!

ఇంతకు ఆ తుపాకులకు లైసెన్స్ ఉందా లేదా..!

ఇంతకు ఆ తుపాకులకు లైసెన్స్ ఉందా లేదా..!

ఇప్పటికే వివాదస్పదుడిగా ముద్రపడి అధిష్టానంతో మొట్టికాయలు తిన్న ప్రణవ్ సింగ్ ప్రవర్తనలో మార్పు రావడం లేదు. బీజేపీ పార్టీకి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న సదరు ఎమ్మెల్యే తీరు చర్చానీయాంశంగా మారింది. ఇప్పుడే కాదు గతంలో కూడా హీరోయిజం ప్రదర్శిస్తూ బురదలో కాలేసిన సందర్భాలున్నాయి. ప్రజాప్రతినిధిగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందాల్సిన వ్యక్తి ఇలా బజారున పడటం హాట్ టాపిక్ అయింది.

ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. మందు తాగుకుంటూ అనుచరులతో చిందేస్తూ తుపాకులు చేతబట్టి ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడమేంటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజా ప్రతినిధి ఇలా చేస్తే సమాజానికి ఎలాంటి మేసేజ్ వెళుతుందోననే ఇంగీత జ్ఞానం లేకుండా ప్రవర్తించారనే కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదలావుంటే ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. ప్రణవ్ సింగ్ ఆ వీడియోలో వాడిన తుపాకులకు లైసెన్స్ ఉందా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MLA Pranav Champion who was recently suspended from the party for threatening a journalist, seen in a viral video brandishing guns. Police says, will look into the matter and also verify if the weapons are licensed or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more