వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ మృతిపై దర్యాప్తు: విహెచ్, ఎన్టీఆర్ పేరుపై గొడవ

By Pratap
|
Google Oneindia TeluguNews

 V Hanumanth Rao said that he will appeal to the Telangana CM K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలుగుదేశం వ్యవస్దాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనారోగ్యంతో చనిపోయారా, లేదంటే కుటుంబ సభ్యులు పెట్టిన మానసిక క్షోభకుతట్టుకోలేక మరణించారా అనే విషయంపై దర్యాప్తు జరిపించి వాస్తవాలు బయట పెట్టవలసిందిగా కోరుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు లేఖ రాయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు చెప్పారు.

అధికారం సంపాదించుకోవటానికి ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటున్న తెలుగుదేశం నాయకులు ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయంలోటెర్మినల్ పేరు మార్పుపై ఒక వివాదం లేవదీస్తూరాజకీయం చేస్తున్నారని ఆయన మీడియాతో అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి తెలంగాణ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హనుమంతరావు ఆ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలావుంటే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టటంపై తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం గొడవ పడ్డారు. సోమవారంనుండి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగించే అంశం గురించి చర్చించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం సాయంత్రం పార్లమెంటు గ్రంథాలయంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అన్ని పక్షాల లోక్‌సభ నాయకులు హాజరైన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పెట్టటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టటం అన్యాయమని వాదించారు.

తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం జితేందర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఎన్టీ రామారావు తెలుగువారందరికి నాయకుడని, అతని పేరు పెట్టటం పూర్తిగా సమర్థనీయమని వాదించారు. ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, గతంలో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేశారని ఆయన వివరించారు. దీనితో ఇద్దరి మధ్య కొంత వాదన జరిగింది.

ఈ దశలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని ‘మీ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు కదా, ఇద్దరూ చర్చించుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా?' అని సూచించటంతో గొడవకు తెరపడింది. ఇద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వౌనంగా ఉండిపోయారు.

English summary
Congress Rajyasabha member V Hanumanth Rao said that he will appeal to the Telangana CM K Chandrasekhar Rao to order enquiry on NT Rama Rao's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X