వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా?: చరిత్ర సృష్టించిన సామాన్యుడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో మరో సువర్ధాధ్యాయం ఆరంభమైంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించారు. అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలో ఓ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌గా ఇది గుర్తింపు పొందింది.

సొంత లాభం కొంత మానుకో: ప్రధాని మోడీ నోట గురజాడ సాహిత్యం: పొరుగు వారికి వ్యాక్సిన్ అందుకేసొంత లాభం కొంత మానుకో: ప్రధాని మోడీ నోట గురజాడ సాహిత్యం: పొరుగు వారికి వ్యాక్సిన్ అందుకే

వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఓ పారిశుద్ధ్య కార్మికుడు చరిత్ర సృష్టించాడు. దేశంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. ఆయన పేరు మనీష్ కుమార్. ఢిల్లీకి చెందిన ఓ సామన్యుడు. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు తొలి కరోనా వ్యాక్సిన్‌ను అందజేశారు డాక్టర్లు. దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఆయనకు టీకా ఇచ్చారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం- ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియాకు వ్యాక్సిన్ ఇచ్చారు.

Vaccination: AIIMS Director Dr Randeep Guleria receives COVID-19 vaccine jab

ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏడాదికాలంలోనే సొంతంగా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసుకోగలిగామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మ కంపెనీ యాజమాన్యం, శాస్త్రవేత్తలను అభినందించారు. అపర సంజీవినిగా కోవాగ్జిన్ చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Vaccination: AIIMS Director Dr Randeep Guleria receives COVID-19 vaccine jab

English summary
AIIMS Director Dr Randeep Guleria receives COVID-19 vaccine jab at AIIMS, Delhi and Manish Kumar, a sanitation worker, becomes the first person to receive COVID-19 vaccine jab at AIIMS, Delhi in presence of Union Health Minister Harsh Vardhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X