వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ భావోద్వేగం: వారి రుణాన్ని తీర్చుకుంటున్నాం: ఎన్నో యుద్ధాలతో సమానం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో మరో సువర్ధాధ్యాయం ఆరంభమైంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలో ఓ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టామని అన్నారు.

ఏపీలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?: అష్ట సూత్రాలు విడుదల చేసిన జగన్ సర్కార్ఏపీలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?: అష్ట సూత్రాలు విడుదల చేసిన జగన్ సర్కార్

రెండో విడతలో 30 కోట్లమందికి

రెండో విడతలో 30 కోట్లమందికి

వ్యాక్సిన్ సురక్షితమైనదని, ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవాలని సూచించారు. రెండో డోసు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కోన్నారు. అలాగే- కరోనా వైరస్‌పై పోరాటాన్ని మాత్రం ఆపొద్దని హెచ్చరించారు. యుద్ధాన్ని కొనసాగించి తీరాల్సిందేనని సూచించారు. వ్యాక్సిన్ వచ్చిందనే ఉద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు. తొలివిడతో మూడు కోట్లమందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రెండో విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలు అద్భుత ప్రతిభను కనపర్చారని ప్రశంసించారు.

విదేశీ వ్యాక్సిన్ల కంటే..

విదేశీ వ్యాక్సిన్ల కంటే..

భారత్‌లో అభివృద్ధి చేసిన, తయారు చేసిన వ్యాక్సిన్ల ధర తక్కువకే లభిస్తోందని అన్నారు. విదేవీ వ్యాక్సిన్ల ధర 5,000 రూపాయల వరకు ఉంటే.. భారత్‌లో 200 రూపాయలు మాత్రమే ఉందని అన్నారు. విదేశీ వ్యాక్సిన్లను మైనస్ 70 డిగ్రీల్లో భద్రపర్చాల్సి ఉండగా.. దేశీయ వ్యాక్సిన్‌కు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది అద్దం పడుతోందని నరేంద్ర మోడీ అన్నారు.

వ్యాక్సిన్ వచ్చిందనే ఉద్దేశంతో కరోనాపై పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా ప్రారంభ సమయంలో దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ కేంద్రం ఉండేదని, ఇప్పుడు వేలాది కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా..

ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా..

వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి అని ప్రధాని పేర్కొన్నారు. మూడు కోట్ల కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ప్రపంచంలో వందకు పైగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఒకేసారి మూడు కోట్ల జనాభాకు తాము తొలిదశలో వ్యాక్సిన్ అందిస్తున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు, తప్పులు చోటు చేసుకోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానని నివారించడంలో మెడికల్ సిబ్బంది, హెల్త్‌కేర్ వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది చూపిన కృషి విస్మరించలేమని అన్నారు. వారి రుణాన్ని తీర్చుకునే అవకాశం తమకు లభించిందని మోడీ భావోద్వేగంతో చెప్పారు. అందుకే వైద్య సిబ్బందికి కరోనావ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.

English summary
Prime Minister Narendra Modi launch the COVID-19 vaccination drive, he wishes the people. Everyone was asking as to when the vaccine will be available. It is available now. I congratulate all the countrymen on this occasion:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X