చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Vaccine: వ్యాక్సిన్ కు 3 నెలల చిన్నారి బలి ?, అంగన్ వాడి సిబ్బంది ఎఫెక్ట్, కళ్ల ముందే బిడ్డ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోయంబత్తూరు: పండంటి బిడ్డపుట్టాడని దంపతులు మురిసిపోయారు. మూడు నెలల పాటు చిన్నారిని కంటికి రెప్పలా చూసుకున్నారు. మూడు నెలల చిన్నారికి టీకా (వ్యాక్సిన్) వెయ్యాలని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడంతో బిడ్డను ఆ దంపతులు అంగన్ వాడి కేంద్రానికి తీసుకెళ్లారు. కళ్ల ముందే టీకాలు వేసిన కొంత సేపటికే బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఆ దంపతులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

Doubt: భార్య మీద అంకుల్ కు అనుమానం, అసలే మేడమ్ ది బ్యూటీ పార్లర్, కథ క్లైమాక్స్..!Doubt: భార్య మీద అంకుల్ కు అనుమానం, అసలే మేడమ్ ది బ్యూటీ పార్లర్, కథ క్లైమాక్స్..!

పండంటి బిడ్డ

పండంటి బిడ్డ


తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు నెలల క్రితం పండంటి బిడ్డ పుట్టాడని ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు మురిసిపోయారు. బాబుకు కిసాన్ అని నామకరణం చేశారు. మూడు నెలల నుంచి ప్రసాద్, విజయలక్ష్మి దంపతులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కిసాన్ ను కంటికి రెప్పలా చూసుకున్నారు.

 ఆరోగ్య శాఖ సిబ్బంది

ఆరోగ్య శాఖ సిబ్బంది

మూడు నెలల చిన్నారికి టీకాలు (వ్యాక్సిన్) వెయ్యాలని, మీరు అంగన్ వాడి కేంద్రానికి బిడ్డను ఎత్తుకుని రావాలని ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రసాద్, విజయలక్ష్మి దంపతులకు సూచించారు. బిడ్డను ఎత్తుకుని అంగన్ వాడి కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించారు. టీకాలు వేసిన తరువాత కిసాన్ పాలు తాగడం మానేశాడు.

 టీకాతో బిడ్డ ప్రాణం పోయింది ?

టీకాతో బిడ్డ ప్రాణం పోయింది ?

టీకాలు వేసిన కొంత సేపటి తరువాత కిసాన్ లో ఏమాత్రం చలనం లేకుండా పోయింది. ఆందోళన చెందిన ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు మళ్లీ బిడ్డను ఇంటి సమీపంలోని అంగన్ వాడి కేంద్రానికి ఎత్తుకుని వెళ్లారు. అంగన్ వాడి కేంద్రంలోకి వెళ్లిన కొంత సేపటికే కిసాన్ ప్రాణాలు పోయాయి. టీకాలు వెయ్యడం వలనే తమ బిడ్డ మరణించాడని ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు ఆరోపిస్తూ పోలీసు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిసాన్ ఎలా మరణించాడు ? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Vaccine: 3 months baby died in Coimbatore after he was given vaccine. Tamil Nadu Police investigation going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X