హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇండియాలో 19వ శతాబ్దం నుండే వ్యాక్సిన్ చరిత్ర .. కరోనా వ్యాక్సిన్ తయారీలోనూ ప్రపంచంతో పోటీ

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రపంచంపై విధ్వంసం సృష్టించిన ఎనిమిది నెలల్లో, క్లినికల్ ట్రయల్ దశకు రెండు వ్యాక్సిన్ లను భారతదేశం అభివృద్ధి చేసింది. అయితే కరోనా నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది . భారత దేశానికి వ్యాక్సిన్ ల చరిత్ర 19 వ శతాబ్ధం నుండే ఉంది . అప్పట్లోనే వ్యాక్సిన్ ప్రయత్నాలు జరిగినట్టు ఆధారాలున్నాయి.

నిమ్స్‌లో కోవ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్స్నిమ్స్‌లో కోవ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్స్

కరోనా వ్యాక్సిన్ కోసం పోటీలో ఇండియన్ కంపెనీలు ..

కరోనా వ్యాక్సిన్ కోసం పోటీలో ఇండియన్ కంపెనీలు ..

పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించనుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, అస్ట్రాజెనీకాతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన మూడో దశ క్లీనికల్ ప్రయోగాలు నిర్వహిస్తోంది ఆ సంస్థ. దేశంలో సీరమ్‌తో పాటు జిడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ ఇంటర్నెషనల్ సంస్థలు కూడా కోవిడ్ వ్యాక్సిన్స్ తయారీలో బిజీగా ఉన్నాయి . ప్రస్తుతం ఆ రెండు సంస్థలు రెండో దశ మానవ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి సీరమ్‌తో పాటు మరికొన్ని సంస్థల కోవిడ్ వ్యాక్సిన్లు సిద్ధమయ్యే అవకాశముంది.

వ్యాక్సిన్ అభివృద్ధిలో భారతదేశంలో 19 శతాబ్దం నుండే ప్రయోగాలు

వ్యాక్సిన్ అభివృద్ధిలో భారతదేశంలో 19 శతాబ్దం నుండే ప్రయోగాలు

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న 150 కరోనా వ్యాక్సిన్ లలో మూడు కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం భారతదేశం ట్రయల్స్‌లో పాల్గొంటుంది. మార్కెట్ పరిశోధన సంస్థ ఇమార్క్ అంచనా ప్రకారం భారతదేశ వ్యాక్సిన్ మార్కెట్ 2019 లో రూ .9,400 కోట్లు. వ్యాక్సిన్ అభివృద్ధిలో భారతదేశంలో 19 శతాబ్దం నుండే ప్రయోగాలు మొదలయినట్టు తెలుస్తుంది . ఉక్రేనియన్ బాక్టీరియాలజిస్ట్ కలరా కోసం తన వ్యాక్సిన్‌ను పరీక్షించడానికి దేశానికి వచ్చినప్పుడు, దేశంలో మొదటిసారి కలరా మహమ్మారిపై వ్యాక్సిన్ ప్రయోగం జరిగింది . భారతదేశం యొక్క ప్రస్తుత వ్యాక్సిన్ అభివృద్ధి వ్యవస్థ 1990 ల ప్రారంభంలో రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. అంతకు ముందు బ్రిటీష్ పరిపాలనలో కూడా అనేక వ్యాక్సిన్ లు ఇండియాలో అభివృద్ధి చేశారు .

మొదటి వ్యాక్సిన్ ప్రయోగం కలరా మీదే , తర్వాత ప్లేగుకు వ్యాక్సిన్

మొదటి వ్యాక్సిన్ ప్రయోగం కలరా మీదే , తర్వాత ప్లేగుకు వ్యాక్సిన్

మొట్టమొదటి సారిగా1893 లో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ ను ప్రయోగించారు . పారిస్‌లో చదువుతున్నప్పుడు కలరాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన బాక్టీరియాలజిస్ట్ డాక్టర్ వాల్డెమార్ హాఫ్కిన్ దానిని ఇండియాలో ప్రయోగించారు .1896 నాటికి దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ప్లేగుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ఇవ్వాలని హాఫ్కిన్‌ను బ్రిటీష్ ప్రభుత్వం కోరగా బొంబాయిలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో హాఫ్కిన్ 1897 లో ప్లేగు వ్యాధికి మొదటి వ్యాక్సిన్‌ను కనుగొన్నాడు.

20 వ శతాబ్దం ప్రారంభంలో, కలరా, మశూచి, ప్లేగు మరియు టైఫాయిడ్ కోసం నాలుగు టీకాలు

20 వ శతాబ్దం ప్రారంభంలో, కలరా, మశూచి, ప్లేగు మరియు టైఫాయిడ్ కోసం నాలుగు టీకాలు

ఈ ప్రయోగశాలను 1899 నుండి ప్లేగు ప్రయోగశాల అని పిలిచేవారు, 1905 లో బాంబే బాక్టీరియలాజికల్ ల్యాబ్ గా పేరు మార్చారు. చివరికి 1925 లో హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ గా పేరు పెట్టారని తెలుస్తుంది .

20 వ శతాబ్దం ప్రారంభంలో, కలరా, మశూచి, ప్లేగు మరియు టైఫాయిడ్ కోసం నాలుగు టీకాలు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. 1904-1905లో హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలిలోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు 1907 లో తమిళనాడులోని కూనూర్ వద్ద పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సదరన్ ఇండియా వంటి కొన్ని ప్రారంభ సంస్థలు స్థాపించబడ్డాయి.

 రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత వ్యాక్సిన్ అభివృద్ధిలో వెనకబడిన ఇండియా

రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత వ్యాక్సిన్ అభివృద్ధిలో వెనకబడిన ఇండియా

1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందే సమయానికి, మశూచి వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధిగా ఉంది. 1930 ల వరకు టీకా పరిశోధన మరియు ఉత్పత్తితో భారతదేశం యొక్క స్వర్ణ కాలం. కానీ రెండు ప్రపంచ యుద్ధాల తరువాత, ఈ సంస్థలు నైపుణ్యం ఉన్నప్పటికీ తగిన వనరులు మరియు మౌలిక సదుపాయాలలేమితో పరిశోధనల్లో వెనకబడ్డాయి . వ్యాక్సిన్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నా భారతదేశం మాత్రం కొనసాగించలేకపోయింది.

ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం .. పెట్టుబడులు విస్తరించిన ప్రైవేట్ సంస్థలు

ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం .. పెట్టుబడులు విస్తరించిన ప్రైవేట్ సంస్థలు

స్వాతంత్ర్యం తరువాత భారత ప్రభుత్వం యొక్క పాత్ర నిధులు ,పరిశోధన మరియు అభివృద్ధి విషయానికి వస్తే ప్రైవేటు రంగానికి సహాయకారిగా మారింది. ఉదాహరణకు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మరియు బయోటెక్నాలజీ విభాగం వంటి సంస్థలు ఈ రంగంలో తమ పెట్టుబడులను విస్తరించాయి. భారతదేశం తన మొట్టమొదటి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ - ఎక్స్‌పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ (ఇపిఐ) ను 1978 లో ప్రారంభించింది. ఇందులో క్షయ, పోలియో మరియు టెటానస్ వంటి వ్యాధులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చింది .

Recommended Video

Top News Of The Day : Kim సంచలన ప్రకటన.. China కు ఉత్తర కొరియా మద్దతు!
పోటీ పడి వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముందుకు వెళ్తున్న ప్రైవేట్ సంస్థలు

పోటీ పడి వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముందుకు వెళ్తున్న ప్రైవేట్ సంస్థలు

1990 లలో ప్రైవేటు రంగం వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించబడింది. ఖరీదైన వ్యాక్సిన్ల ఉత్పత్తిపై ఆసక్తి పెరిగింది .ప్రస్తుతం అందులో భాగంగానే ప్రైవేట్ సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో పోటీ పడుతున్నాయి . ప్రైవేటు రంగానికి లాభదాయకం కాని సాంప్రదాయ వ్యాక్సిన్ లను ప్రభుత్వం ఇప్పటికీ ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో మీజిల్స్ వ్యాక్సిన్ తయారీని చేపట్టిన మొట్టమొదటి ప్రైవేట్ సంస్థలలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇది ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు శ్రమిస్తుంది .

English summary
India’s brush with vaccine development goes back to the 19th century, when a Ukrainian bacteriologist arrived in the country to test his vaccine for cholera.India's current vaccine development system began to take shape in the early 1990s. Many vaccines were also developed in India during the earlier British rule. India is currently competing in the manufacture of the corona vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X