వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం.. ఎంపీలుగా వైగో, రాందాస్...

|
Google Oneindia TeluguNews

చెన్నై : తమిళనాడు ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ఆరు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. వాస్తవానిిక డీఎంకే నుంచి ఎన్ ఆర్ ఈలంగో కూడా పోటీ చేశారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు చివరికి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో ఆరు స్థానాల ఎంపిక ప్రక్రియ ఎన్నిక లేకుండానే ముగిసింది.

ఏకగ్రీవమే
రాష్ట్రంలోని ఆరు స్థానాలకు ఎన్నికల సంఘం నోటిపికేషన్ జారీచేసింది. ప్రధాన పార్టీల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే డీఎంకే నుంచి అదనంగా ఈలంగో నామినేషన్ వేశారు. చివరకు ఆయన వెనక్కి తీసుకోవడంతో ఏకగ్రీవమైంది. ఎండీఎంకే చీఫ్ వైగో, పీఎంకే చీఫ్ అంబుమణి రాందాస్, డీఎంకే నుంచి ఎం షణ్ముకం, పీ విల్సన్, అన్నాడీఎంకే నుంచి చంద్రశేఖరన్, మొహమ్మద్ జన్ ఎన్నికైనట్టు తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి కే శ్రీనివాసన్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం సభ్యుల ఎన్నిక జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. గెలిచిన సభ్యులకు ధ్రువపత్రాలను అధికారి శ్రీనివాస్ అందజేశారు.

Vaiko, Anbumani Ramadoss elected unopposed to Rajya Sabha from Tamil Nadu

రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన అన్నాడీఎంకే, రాందాస్‌కు తమిళనాడు సీఎం పళనిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. తన చాంబర్‌కు వచ్చిన వారికి విష్ చేశారు. మరోవైపు డీఎంకే, వైగోలు డీఎంకే చీప్ స్టాలిన్‌ను కలిశారు. ఆయన వారిని అభినందించారు.

English summary
six candidates, including Marumalarchi Dravida Munnetra Kazhagam (MDMK) chief Vaiko and Pattali Makkal Katchi's (PMK) Anbumani Ramadoss, were Thursday elected unopposed in the biennial elections to Rajya Sabha from Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X